Prema Desam: దీనికోసమే ఎదురు చూస్తున్నామంటున్న యూత్.. ‘ప్రేమదేశం’ రీ రిలీజ్ ఎప్పుడంటే..

  • December 3, 2022 / 10:20 PM IST

టాలీవుడ్‌లో కొద్ది రోజుల నుండి స్టార్ హీరోల పుట్టినరోజులు, బెంచ్ మార్క్ ఇయర్స్‌కి సూపర్ హిట్ సినిమాల స్పెషల్ షోలు.. ఇంకో అడుగు ముందుకేసి ఫిలిం నుండి డిజిటల్‌లోకి కన్వర్షన్ చేయించి పాత చిత్రాలను మళ్లీ రీ రిలీజ్ చేయడం అనే ట్రెండ్ నడుస్తోంది. బాలయ్య ‘చెన్నకేశవ రెడ్డి’ 19 సంవత్సరాలకి స్పెషల్ షోలు.. 20 ఇయర్స్ అప్పుడు రీ రిలీజ్ చేశారు.. ఇటీవల త్రివిక్రమ్ బర్త్‌డే సందర్భంగా ‘నువ్వే నువ్వే’ తో పాటు అక్కినేని నటించిన ‘ప్రతిబింబాలు’ 40 ఏళ్ల తర్వాత..

రెబల్ స్టార్ ప్రభాస్ ‘బిల్లా’, జూనియర్ ఎన్టీఆర్ ‘బాద్‌షా’ చిత్రాలు మళ్లీ విడుదల చేయగా బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి.. ఇప్పుడు మరో బ్యూటిఫుల్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది..‘ముస్తఫ్పా.. ముస్తఫ్ఫా’ అంటూ ప్రాణ స్నేహితులు కార్తీక్ (వినీత్), అరుణ్ (అబ్బాస్) .. పాడుకున్న సినిమా ‘ప్రేమదేశం’.. 1996లో విడుదలైన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అప్పటి ప్రేమకథా చిత్రాల్లో సరికొత్త ఒరవడిని తీసుకొచ్చి, ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.. నటి టబు ఫస్ట్ తమిళ్ సినిమా ఇది..

కదిర్ దర్శకుడు.. ఎ.ఆర్. రెహమాన్ సాంగ్స్ అయితే ఇప్పటికీ వినిపిస్తూ ఉంటాయి.. తమిళ్, తెలుగు ఇండస్ట్రీస్‌లోని లవ్ స్టోరీస్‌లో.. యూత్ ఫేవరెట్ ఫిల్మ్స్ లిస్టులో ఈ సినిమా కచ్చితంగా ఉంటుంది..కోలీవుడ్‌లో ‘కాదల్ దేశం’ పేరుతో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రాన్ని వారంలోపే ‘ప్రేమదేశం’ పేరుతో తెలుగులో డబ్ చేసి వదిలారు. మౌత్ టాక్‌తో, అదిరిపోయే కలెక్షన్లతో ఓ ఊపు ఊపేసింది.. యువత అంతా కాలేజీకి బంక్ కొట్టి మరీ ఈ సినిమాకెళ్లేవారంటే అర్థం చేసుకోవచ్చు..

దాదాపు 16 సంవత్సరాల తర్వాత ఈ క్రేజీ లవ్ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. టెక్నికల్‌గా కొన్ని మార్పులు చేసి.. డిసెంబర్ 9న హైదరాబాద్‌లో రీ రిలీజ్ చేస్తున్నారు.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సుదర్శన్ 35 మెయిన్ థియేటర్ కాగా పలు మల్టీప్లెక్సుల్లోనూ ప్రదర్శించనున్నారు. ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామంటున్నారు యూత్..

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus