రాజమౌళి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి సర్వం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణా ప్రభుత్వం షూటింగ్స్ కి అనుమతి ఇవ్వడంతో రాజమౌళి షూటింగ్ తేదీ ఖరారు చేశారట. జూన్ 15 నుండి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మొదలు కానుందట. ఇప్పటికే దాదాపు 70శాతానికి పైగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తి కాగా మిగిలిన షూటింగ్ కొరకు రాజమౌళి ప్రణాళికలు వేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ మిగిలిన సన్నివేశాలు ఉత్తర భారత దేశంలో చిత్రీకరించాలని అనుకున్నారు.
లాక్ డౌన్ కారణంగా చాలా వరకు సెట్స్ లో చిత్రీకరించాలని రాజమౌళి ప్లాన్. ప్రభుత్వ నిబంధనల నేపథ్యంలో భారీ సిబ్బందితో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణకు అనుమతి లేదు. దీనితో తక్కువ నటులు పాల్గొనే సన్నివేశాలు ప్రస్తుతం చిత్రీకరించనున్నారు. దీని కోసం రాజమౌళి ఇప్పటికే ప్రత్యేక సెట్ వేయిస్తున్నారట. అది పూర్తి అయిన వెంటనే రెండవ వారం చివరి నుండి షూటింగ్ షురూ చేస్తారు. ఇక ఆర్ ఆర్ ఆర్ హీరోలు ఎన్టీఆర్, చరణ్ కూడా సిద్ధం అవుతున్నారు.
ఆర్ ఆర్ ఆర్ వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కావాల్సి ఉండగా ఆ తేదీన విడుదల కావడం కష్టమే అంటున్నారు. నిర్మాత డి వి వి దానయ్య దీనిపై కొంత స్పష్టత కూడా ఇచ్చారు. ఇప్పటి నుండైనా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ జరిగితే 2021 సమ్మర్ లో విడుదల అవుతుంది.
Most Recommended Video
రన్ మూవీ రివ్యూ & రేటింగ్
జ్యోతిక ‘పొన్‌మగల్ వందాల్’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!