‘వకీల్ సాబ్’ షూటింగ్ కు షరతులు పెడుతున్న పవన్ కళ్యాణ్…!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ తిరిగి ‘వకీల్ సాబ్’ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారా అంటే అవున‌నే స‌మాధానం ఎక్కువగా వినిపిస్తోంది. వేణు శ్రీ‌రామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ క‌పూర్ లు కలిసి నిర్మిస్తున్నారు. నిజానికి సమ్మర్ లో విడుదల కావాల్సిన ఈ చిత్రం షూటింగ్ క‌రోనా వైర‌స్ లాక్ డౌన్ కార‌ణంగా ఆగిపోయింది. వ్యాక్సిన్ వచ్చిన త‌రువాతే షూటింగ్లలో పాల్గొంటాను అని పవన్ కళ్యాణ్ ఇటీవల ఓ సందర్భంలో తెలియజేసాడు.

అయితే ఇప్పుడు ‘వకీల్ సాబ్’ షూటింగ్ కొంత పార్టు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అది కూడా పవన్ కళ్యాణ్ పార్టే…! అందుకే తన వల్ల షూటింగ్ లేట్ అవ్వడం ఇష్టంలేక కొన్ని కండిషన్లతో షూటింగ్లో పాల్గొనడానికి ఓకే చెప్పేశాడట. ఆ కండిషన్స్ ఏంటంటే….ప్రస్తుతం పవన్ చతుర్మాస దీక్షలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ దీక్ష నవంబర్ నెల పూర్తయ్యే వరకూ చెయ్యాలి. కానీ దిల్ రాజు అప్పటి వరకూ వెయిట్ చెయ్యడం ఇష్టం లేక.. అక్టోబర్ నెల మధ్యలో నుండీ మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నాడట.

ఇందుకు పవన్ ను కూడా ఒప్పించాడని తెలుస్తుంది.అయితే పవన్ మాత్రం… 6 త‌రువాత నేను పూజ చేసుకోవాలి… లేకపోతే దీక్షకు భంగం కలుగుతుంది. అలా జరిగితే షూటింగ్ చేయ‌న‌ని నిక్క‌చ్చిగా చెప్పేశాడట.కాబట్టి పవన్ కోసం 6లోపే షూటింగ్ కు ప్యాకప్ చెప్పెయ్యాలన్న మాట.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus