Veera Dheera Soora: విక్రమ్ సినిమా ఈవెనింగ్ షోలతో రిలీజ్!

ఈరోజు ‘ఎల్2 : ఎంపురాన్’ తో పాటు చియాన్ విక్రమ్  (Vikram) హీరోగా నటించిన ‘వీర ధీర శూర’  (Veera Dheera Soora) కూడా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ కి ఆటంకాలు వచ్చి పడ్డాయి. ఢిల్లీ హైకోర్టు ఈ సినిమా రిలీజ్ పై స్టే ఇచ్చింది. ఈ సినిమా నిర్మాణ సంస్థల్లో ఒకటైన ‘B4U’ సంస్థ నిర్మాతపై లీగల్ నోటీసులు ఇష్యు చేస్తూ ఢిల్లీ కోర్టుకెక్కడం వల్ల… రిలీజ్ నిలిచిపోయింది.తమిళనాడులోనే కాకుండా తెలుగులో కూడా షోలు క్యాన్సిల్ అయ్యాయి.

Veera Dheera Soora

48 గంటల్లోపు.. ఇష్యుని సార్ట్- అవుట్ చేసుకోవాలని, అప్పటివరకు సినిమా రిలీజ్ ని నిషేధిస్తూ ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. అయితే ఇప్పుడు ఆ ఫైనాన్స్ లెక్కలు అన్నీ సార్ట్- అవుట్ అయినట్టు చిత్ర బృందం ప్రకటించింది. సో ఈవెనింగ్ షోలతో ‘వీర ధీర శూర’ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. విక్రమ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకి ఎస్.యు.అరుణ్ కుమార్ (S. U. Arun Kumar)  దర్శకుడు.

‘సేతుపతి’ (Vijay Sethupathi)  ‘చిన్నా’ వంటి సూపర్ హిట్లు ఇచ్చిన దర్శకుడు కావడంతో తమిళనాట ‘వీర ధీర శూర’ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక రెండు భాగాలుగా రూపొందిన ఈ సినిమా మొదటి భాగం కాకుండా.. ఇప్పుడు రెండో భాగం రిలీజ్ అవుతుండటం విశేషంగా చెప్పుకోవాలి. ఎస్.జె.సూర్య (S. J. Suryah)  అతి కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో 30 ఇయర్స్ పృథ్వీ కూడా ముఖ్య పాత్ర పోషించాడు. మరి సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags