పూరీ గారి అబ్బాయి రెండో సినిమాకి రెడీ అయ్యాడు
- February 7, 2019 / 01:12 PM ISTByFilmy Focus
అదృష్టం బాలేకనో లేక పూరీ టైమింగ్ బాగోలేకనో ఆకాష్ పూరీ పరిచయ చిత్రమైన “మెహబూబా” బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లాపడింది కానీ ఆ సినిమాలో ఆకాష్ మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ కి. మాస్ ఎక్స్ ప్రెషన్స్ చూసి ఇండస్ట్రీకి మరో మాస్ హీరో దొరికేసాడు అని ఫిక్స్ అయిపోయారు సినిమా అభిమానులందరూ. అయితేనేం.. పూరీ జగన్నాధ్ లాంటి తండ్రి వెనక ఉండగా.. ఆకాష్ హీరోగా సెటిల్ అవ్వకుండా ఉంటాడా చెప్పండి.
- ప్రకాష్ రాజ్ కు లీగల్ నోటీసులు.. కారణమేమిటంటే..!
- హీరో జై తో ఎఫైర్… పై అంజలి కామెంట్స్!
- హైద్రాబాద్ లో మహేష్ బాబు విగ్రహం
కొడుకును ఎట్టి పరిస్థితుల్లోనూ హీరోగా సెటిల్ చేయడమే ప్రస్తుత ధ్యేయంగా పెట్టుకున్న పూరీ జగన్నాధ్ నిజానికి తన తదుపరి చిత్రంగా ఆకాష్ నే మళ్ళీ హీరోగా పెట్టి ఒక సినిమా ప్లాన్ చేశాడు. కానీ.. ఉన్నపళంగా రామ్ సినిమా మొదలవ్వడంతో తన అసిస్టెంట్ దిలీప్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తన కొడుకు హీరోగా తానే మరో సినిమా నిర్మించేందుకు రెడీ అయ్యాడు పూరీ జగన్నాధ్. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఈ ప్రొజెక్ట్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ను పూరీ రివీల్ చేస్తాడు. ఈ సినిమాతో ఆకాష్ హీరోగా సెటిల్ అవ్వడమే కాదు ఒక కొత్త ఒరవడి సృష్టిస్తాడని ఇండస్ట్రీ వర్గాల నమ్మకం.













