Allu Sirish: అల్లరి నరేష్ దర్శకుడితో అల్లు శిరీష్ సినిమా?

అల్లు శిరీష్ సినిమాలపై పెద్దగా ఫోకస్ పెట్టడం లేదో… లేక అతన్ని దర్శకనిర్మాతలు ఎవ్వరూ అప్రోచ్ అవ్వక ఖాళీగా ఉంటున్నాడో.. అనే విషయం ఇప్పటికీ చాలా మందికి క్లారిటీ లేదు. శిరీష్ కెరీర్లో ‘కొత్త జంట’ ‘శ్రీరస్తు శుభమస్తు’ ‘ఒక్క క్షణం’ వంటి డీసెంట్ హిట్లు ఉన్నాయి. ఎంతో కొంత మార్కెట్ అయితే శిరీష్ కు ఉంది. లేదు అంటే సొంత బ్యానర్ పై సినిమాలు చేసి రిలీజ్ చేసుకునే కెపాసిటీ శిరీష్ తండ్రి అల్లు అరవింద్ కు ఉంది.

Allu Sirish

టాలీవుడ్లో ఆయనకు అసాధ్యమంటూ ఏమీ లేదు. పైగా శిరీష్ సినిమాలు ప్రమోట్ చేయడానికి అతని అన్న, పాన్ ఇండియా స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ ఉన్నాడు. అలాంటప్పుడు శిరీష్ సినిమాలతో బిజీగా లేకపోవడానికి ఏం అడ్డంకులు ఉన్నట్టు? శిరీష్ తర్వాత వచ్చిన చాలా మంది యంగ్ హీరోలు.. వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు.

అయితే శిరీష్ మాత్రం 2 ఏళ్ళకు ఒక సినిమా అన్నట్టు కాలం గడుపుతున్నాడు. 2022 లో వచ్చిన ‘ఊర్వశివో రాక్షసివో’ తర్వాత శిరీష్ 2 ఏళ్ళు గ్యాప్ తీసుకుని ‘బడ్డి’ అనే సినిమా చేశాడు. ఇవి 2 ఆడలేదు. దీంతో మళ్ళీ ఏడాది గ్యాప్ తీసుకున్నాడు. ఫైనల్ గా ఇతను దర్శకుడు సుబ్బుతో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ‘సోలో బ్రతుకే సో బెటర్’ తో డీసెంట్ హిట్ కొట్టిన సుబ్బు.. కొంత గ్యాప్ తీసుకుని అల్లరి నరేష్ తో ‘బచ్చల మల్లి’ అనే సినిమా చేశాడు.

అది ఫ్లాప్ అయ్యింది. దీంతో ఓ మంచి రామ్ కామ్ కథ రెడీ చేసిన శిరీష్ ను అప్రోచ్ అయినట్టు తెలుస్తుంది. శిరీష్ కి కూడా ఈ కథ బాగా నచ్చిందట. అయితే దీనిని ఎవరు నిర్మిస్తారు అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాతో అయినా ఓ సాలిడ్ హిట్ కొట్టి శిరీష్ మళ్ళీ బిజీ అవుతాడేమో చూడాలి.

మురుగదాస్ హిట్టు కొట్టి ఫామ్లోకి వచ్చినట్టేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus