Madharaasi: మురుగదాస్ హిట్టు కొట్టి ఫామ్లోకి వచ్చినట్టేనా?

ఏ.ఆర్.మురుగదాస్.. గతంలో ‘రమణ’ ‘గజినీ’ ‘తుపాకీ’ ‘కత్తి’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన దర్శకుడే. కానీ తర్వాత అతన్ని ప్లాపులు వెంటాడాయి. ‘స్పైడర్’ ‘దర్బార్’ ‘సికందర్’ వంటి సినిమాలు చూస్తే మురుగదాస్ ఫామ్ కోల్పోయాడు అని ఈజీగా అర్ధమవుతుంది. దీంతో విజయ్ ‘తుపాకీ’ సీక్వెల్ చేయడానికి ముందుకు రాలేదు. పెద్ద హీరోలు మాత్రమే కాదు మిడ్ రేంజ్ హీరోలు కూడా మురుగదాస్ తో సినిమా చేయడానికి వెనకడుగు వేశారు.

Madharaasi First Review

కాబట్టి కచ్చితంగా హిట్టు కొట్టి ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లో మురుగదాస్ ఉన్నారు. ఇలాంటి టైంలో శివ కార్తికేయన్ రూపంలో అతనికి ఓ సువర్ణావకాశం లభించింది. ప్రస్తుతం శివ కార్తికేయన్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ‘అమరన్’ తో స్టార్ హీరోగా ఎదిగాడు. అతని సినిమాలకు రూ.200 కోట్లు మార్కెట్ ఉంది. సో మురుగదాస్ తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఫామ్లోకి రావడానికి ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది? వీరి కాంబినేషన్లో రూపొందిన ‘మదరాసి’ ఈ సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి.


చుట్టుపక్కనున్న వాళ్లకి సమస్యలు వస్తే.. తనకి వచ్చినట్టే ఫీలయ్యే రఘు(శివ కార్తికేయన్).. తను ప్రేమించే మాలతి(రుక్మిణి వసంత్) కి సమస్య వస్తే ఎలా రియాక్ట్ అయ్యాడు.? అతనికి ఉన్న మానసిక సమస్య ఏంటి? విలన్(విధ్యుత్ జమ్వాల్) తమిళ నాడుని టార్గెట్ చేసి.. అక్రమంగా ఆయుధాలను ఎందుకు తరలించాడు? విషయం తెలుసుకున్న పోలీస్ వ్యవస్థ ఏం చేసింది?

ఈ గొడవలోకి రఘు, మాలతీ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది? ఆ తర్వాత వారికి ఎదురైన సవాళ్లు ఏంటి? అనేది ఈ సినిమా కథ అని తెలుస్తుంది.తుపాకీ స్టైల్లో సాగే కథ ఇది అని అంటున్నారు. విలన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కథ నడుస్తుంది అని దర్శకుడు మురుగదాస్ కూడా చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.సినిమాలో యాక్ష‌న్ ఎపిసోడ్స్ ఎక్కువగానే ఉంటాయట. . శివ‌కార్తికేయ‌న్ నటన, రుక్మిణి వసంత్ గ్లామర్, అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. మరి సెప్టెంబర్ 5న ఈ సినిమాకి ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.

అనుష్కని నగ్న*గా అవమానిస్తారా? ఆ ఎపిసోడ్ స్వీటీ ఫ్యాన్స్ కి నచ్చుతుందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus