Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » ఇంటర్వ్యూలు » Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

  • September 2, 2026 / 03:24 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

అల్లరి నరేష్(Allari Naresh) నుండీ ఓ ఫుల్ లెంగ్త్ కామిడీ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. మొత్తానికి ఇప్పుడు ‘రంభ ఊర్వశి మేనక’ అంటూ నవ్వించడానికి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ట్రైలర్ ప్రామిసింగ్ గా అనిపించింది. అల్లరి నరేష్ అగ్రెసివ్ గా సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా విలేకరి సమావేశంలో పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఆ విశేషాలు మీకోసం :

Allari Naresh

allari naresh

ప్ర) ‘రంభ ఊర్వశి మేనక’ కథ విన్నప్పుడు మిమ్మల్ని హుక్ చేసిన పాయింట్ ఏంటి?
అల్లరి నరేష్ : సాధారణంగా మునులు తపస్సు చేస్తే రంభ, ఊర్వశి, మేనక కిందకు వచ్చి డిస్టర్బ్ చేసినట్టు మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ మా సినిమాలో కాన్సెప్ట్ భిన్నంగా ఉంటుంది. ఇప్పటివరకు కింద నుంచి పైకి (నరకానికి/స్వర్గానికి) వెళ్లే నేపథ్యంలో వచ్చిన సినిమాలనే ఎక్కువగా చూస్తూ వచ్చాము. ‘యమగోల’ ‘యముడికి మొగుడు’ వంటివి అందుకు ఉదాహరణకి చెప్పుకోవచ్చు. కానీ రంభ, ఊర్వశి, మేనక వంటి దేవకన్యలు కిందకి రావడం అనేది కొత్తగా అనిపించింది.

ప్ర) దేవకన్య భూలోకానికి రావడం అనేది ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’లో చూశాం కాదా?
అల్లరి నరేష్ : కరెక్టే..! కానీ దాని నేపధ్యం వేరు..! మాది పక్కా కామెడీ జోనర్లో సాగే కథ. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్ చేస్తుంది.

ప్ర) కామెడీ జానర్ లోకి రీ-ఎంట్రీ ఎలా అనిపిస్తుంది?
అల్లరి నరేష్ : ఇది నా కంఫర్ట్ జోన్. ‘నాంది’ లాంటి సీరియస్ సినిమాలు చేసినప్పటికీ హోమ్ గ్రౌండ్ లాంటి కామెడీ జోనర్ చేసి సిక్స్(హిట్) కొడితే ఆ కిక్కే వేరు కదా అనిపించింది.వల్గారిటీ, డబుల్ మీనింగ్ డైలాగులు వంటివి లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా ‘రంభ ఊర్వశి మేనక’ ఉంటుంది.

ప్ర) ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమా టైంలో కూడా మీరు కామిడీ జోనర్లోకి వచ్చాను.. హిట్టు కొడతాను అని చెప్పారు..!?
అల్లరి నరేష్ : ‘ఆ ఒక్కటీ అడక్కు’ కామెడీ సినిమాగానే మొదలవుతుంది. కానీ సెకండాఫ్..కి వచ్చేసరికి జోనర్ మారిపోయిన ఫీలింగ్ వచ్చింది. మంచి కాన్సప్ట్ తో చేసిన సినిమానే అది. కానీ సీరియస్ గా మారిపోవడంతో ఆడియన్స్ కన్విన్స్ అవ్వలేకపోయారేమో అనిపించింది. కానీ ‘రంభ ఊర్వశి మేనక’ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిలిం..!

ప్ర) ‘రాధ’ తర్వాత చంద్ర మోహన్ గారికి గ్యాప్ వచ్చింది కదా? ఈ సినిమా ఔట్పుట్ విషయంలో మీరు సంతృప్తి చెందారా?
అల్లరి నరేష్ : ఈ చిత్రానికి చంద్రమోహన్ గారు దర్శకత్వం వహించారు, అయితే నందు డైలాగ్స్ రాశారు. స్క్రిప్ట్ విషయంలో రాజేష్ గారు, సుప్రియ గారు, నాగార్జున గారు ఇలా అందరికీ నమ్మకం కుదిరాకే షూటింగ్ ప్రారంభించాం. వాళ్లందరినీ డైరెక్టర్ కన్విన్స్ చేసి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడం అంటే చిన్న విషయం కాదు. ప్రతి విషయంలోనూ చంద్రమోహన్ గారు చాలా కేర్ తీసుకున్నారు.

ప్ర) మీరు కామిడీ సినిమా తీస్తుంటే.. ఎక్కువగా హాట్ టాపిక్ అయ్యేది.. అందులోని స్పూఫ్ మెటీరియల్..! ఈ సినిమాలో ‘ఓజి’ వంటి పెద్ద సినిమాల స్పూఫ్..లు ఉన్నట్టు ఉన్నాయి?

అల్లరి నరేష్ : నిజమే..! నా సినిమాలో స్పూఫ్..లు కూడా హాట్ టాపిక్ అవుతుంటాయి. ‘రంభ ఊర్వశి మేనక’ లో ‘ఓజి’ స్పూఫ్ ఉంది. కానీ అది సిట్యుయేషన్ కి సింక్ అవుతుంది. పెట్టాలని పెట్టింది అయితే కాదు. అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది.

ప్ర) ‘సుడిగాడు-2’ కథ రెడీగా ఉందా?
అల్లరి నరేష్ : మొన్న నేను అనిల్ రావిపూడి గారు ఈ విషయంపై చర్చించుకున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ‘సుడిగాడు’ లాంటి స్పూఫ్ సినిమా తీయడం కష్టం. ఎందుకంటే కాపీరైట్ చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. పది సెకన్ల పాట వాడాలన్నా, ఒక డైలాగ్ వాడాలన్నా భారీగా డబ్బులు చెల్లించి అనుమతులు తీసుకోవాల్సి వస్తుంది. ‘సుడిగాడు’ ఆ రోజుల్లో చేశాం కాబట్టి సరిపోయింది.

ప్ర) ‘మహర్షి’ ‘నా సామి రంగ’ లాంటి సినిమాలు కంటిన్యూ చేస్తారా?
అల్లరి నరేష్ : ‘మహర్షి’ ‘నా సామి రంగ’ తరహా పాత్రలు వస్తే మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి నేను ఎప్పుడూ రెడీ..! వాస్తవానికి ‘మహర్షి’ కంటే ముందే నేను ‘శంభో శివ శంభో’ చేశాను. సో పాత్ర నచ్చితే కచ్చితంగా చేస్తాను.

ప్ర) ‘కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు’ అని మొన్నామధ్య మీరు అన్నారు..! కానీ ఇప్పుడు ‘కామిడీ రూపాంతరం చెందింది’ అని ఎప్పుడైనా అనిపించిందా?
అల్లరి నరేష్ : అది కూడా కరెక్టే..! ఇప్పుడు కామిడీ రూపాంతరం చెందింది. ఆడియన్స్ రిలేటబుల్ లేదా సిట్యుయేషనల్ కామెడీని ఆదరిస్తున్నారు. అప్పుడప్పుడు నాకు కూడా అనిపిస్తుంటుంది. తరుణ్ భాస్కర్, రితేష్ రానా వంటి దర్శకులతో పనిచేయాలని..! రితేష్ రానా తీసిన ‘మత్తు వదలరా’ లో కామెడీ నాకు బాగా ఇష్టం. అలాగే తరుణ్ భాస్కర్ తీసిన ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమాలో కామెడీ కూడా బాగా ఎంజాయ్ చేశాను. ఈ దర్శకులతో పనిచేసే ఛాన్స్ వస్తే.. నేను వదులుకోను..!

ప్ర) ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది.. కాబట్టి… మీ సినిమాల్లో ఏదైనా సినిమా రీ రిలీజ్ అయితే బాగుణ్ణు అని అనిపిస్తుందా?
అల్లరి నరేష్ : అది ఆడియన్స్ ఇష్టం పై ఆధారపడుతుంది. వాళ్ళే చెప్పాలి..! కొంతమంది ‘కితకితలు’ ‘బెండు అప్పారావు’ ‘సుడిగాడు’ వంటి సినిమాలు రీ- రిలీజ్ చేయమంటున్నారు. ఇంకొంతమంది అయితే ‘ఆరుగురు పతివ్రతలు’ సినిమాని రీ రిలీజ్ చేయమంటున్నారు. ఆ సినిమాలో నేను యాక్ట్ చేయలేదు. కానీ మా బ్యానర్లో వచ్చిన సినిమా కాబట్టి.. కొంతమంది నన్ను ఆదుకోవడానికి ఆ సినిమా రీ రిలీజ్ కావాలంటున్నారు(నవ్వుతూ)

ప్ర) ఫైనల్లీ.. ‘రంభ ఊర్వశి మేనక’ గురించి ఆడియన్స్ కి ఏం చెబుతారు?
అల్లరి నరేష్: చాలా రోజుల తర్వాత అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా చేశాను. క్లీన్ కామిడీ ఎంటర్టైనర్. ఫ్యామిలీస్ అంతా థియేటర్..కి వచ్చి నవ్వుకుని వెళ్ళండి..!

డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Interviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allari Naresh
  • #Rambha Urvasi Menaka

Also Read

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

related news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

trending news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

10 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

12 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

19 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

1 day ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

1 day ago

latest news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

22 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

1 day ago
Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

2 days ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

2 days ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version