మేడ మీద సెల్ఫీ రాజా!

అల్లరి నరేష్ నటించిన “సెల్ఫీ రాజా” నిన్న విడుదలై.. ఘోరంగా పరాజయంపాలైంది. అయితే.. అల్లరి నరేష్ మాత్రం ఆ రిజల్ట్ గురించి పట్టించుకోకుండా.. తన తదుపరి చిత్రంగా జి.నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఇంట్లో దెయ్యం నాకేం భయం” చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత అల్లరోడు “అలా ఎలా” ఫేమ్ అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా అంకీకరించిన విషయం తెలిసిందే.

ప్రముఖ కమెడియన్ కృష్ణ భగవాన్ కథ-మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి “మేడ మీద అబ్బాయి” అనే టైటిల్ ఫీక్స్ చేసినట్లు తెలుస్తోంది.
జాహ్నవి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ లో మొదలుకానుంది. ప్రస్తుతం ఈ చిత్రంలో అల్లరి నరేష్ సరసన సూటయ్యే కథానాయిక కోసం ఎంపిక జరుగుతోంది!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus