నాగ చైతన్య (Naga Chaitanya) – సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన ‘తండేల్’ (Thandel) సినిమా మరికొన్ని గంటల్లో అంటే ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది. చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వం వహించిన ఈ సినిమాని ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ పై అల్లు అరవింద్ (Allu Aravind) , బన్నీ వాస్ (Bunny Vasu) లు నిర్మించారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి కూడా టికెట్ రేట్లు పెంచాలంటూ మేకర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. అందుకు ఏపీ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి టికెట్ రేట్ల పెంపుకి అనుమతి ఇచ్చింది.
అయితే జనాలు ఎక్కువగా వెళ్లే సినిమాకి టికెట్ రేట్లు పెంచినా పర్వాలేదు. కానీ నాగ చైతన్య ఓ మిడ్ రేంజ్ హీరో. అతని సినిమాలకు టాక్ బాగుంటేనే జనాలు వెళ్తారు. అయినా టికెట్ రేట్లు పెంచడంపై మిక్స్డ్ ఒపీనియన్స్ వస్తున్నాయి. దీంతో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో కూడా నిర్మాత అల్లు అరవింద్ కి దీనిపై ప్రశ్న ఎదురైంది.
ఓ రిపోర్టర్… ‘ఏపీలో టికెట్ రేట్స్ పెంచారు. తెలంగాణాలో ఎందుకు పెంచలేదు? ఇక్కడి ప్రభుత్వం ఒప్పుకోదనా? ఎందుకు మీరు ఇక్కడ టికెట్ రేట్లు పెంచమని రిక్వెస్ట్ చేయలేదు?’ అని అల్లు అరవింద్ ను ప్రశ్నించాడు. అందుకు అల్లు అరవింద్.. “తెలంగాణాలో టికెట్ రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. కానీ ఆంధ్రాలో చాలా టికెట్ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి.
పైగా మేము పెంచమని రిక్వెస్ట్ చేసింది కూడా 50 రూపాయలు, 75 రూపాయలు అంతే..! అందరిలా మేము 100 రూపాయలు అలా పెంచలేదు.ఇది నోట్ చేసుకోండి” అంటూ చెప్పుకొచ్చారు. అల్లు అరవింద్ కామెంట్స్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.
తెలంగాణలో టికెట్ రేట్స్ ఆల్రెడీ ఎక్కువ ఉన్నాయి
అందుకే ఇక్కడ హైక్స్ అడగలేదు
ఆంధ్రాలో కేవలం 50 రూపాయలు, మరీ ముఖ్యంగా వారం మాత్రమే హైక్ అడిగాం pic.twitter.com/XnglaKBDcX— Filmy Focus (@FilmyFocus) February 6, 2025