రికార్డ్స్ టెంపరరీ.. మీకు ఎంజాయ్ మెంట్ ఇచ్చాను, అదే ముఖ్యం: అల్లు అర్జున్

  • January 20, 2020 / 03:18 PM IST

మహేష్ మీద అల్లు అర్జున్ ది పై చేయా లేక అల్లు అర్జున్ రికార్డ్స్ కు మహేష్ స్పీడ్ బ్రేక్స్ వేస్తున్నాడా అనే విషయం పక్కన పెడితే.. అల్లు అర్జున్ మాత్రం నిన్న వైజాగ్ లో జరిగిన సక్సెస్ సెలబ్రేషన్స్ లో సినిమా కలెక్షన్స్ గురించి మాట్లాడకుండా.. “రికార్డ్స్ నధింగ్” అనే స్టేట్మెంట్ ఇచ్చి తన మెచ్యూరిటీ లెవల్స్ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. మొన్న హన్మకొండలో జరిగిన “సరిలేరు నీకెవ్వరు” సక్సెస్ సెలబ్రేషన్స్ లో మహేష్ & టీం డిస్ట్రిబ్యూటర్స్ చేత “100 కోట్ల రూపాయల షేర్” పోస్టర్ ను విడుదల చేయించగా.. అది సెన్సేషన్ క్రియేట్ చేసింది.

దాంతో.. “అల వైకుంఠపురములో” టీం కూడా అదే తరహాలో మరో పోస్టర్ రిలీజ్ చేస్తారేమో అనుకుంటే.. బన్నీ సింపుల్ గా “రికార్డ్స్ టెంపరరీ.. మీకు ఎంజాయ్ మెంట్ ఇచ్చాను, నాకు అదే ముఖ్యం.. థియేటర్లో మీరు పొందిన ఆనందం ముందు ఈ రికార్డ్స్ నథింగ్” అని పేర్కొనడం ప్రేక్షకుల మనసు కొల్లగొట్టింది. రికార్డ్స్ నథింగ్ అని స్వయంగా అల్లు అర్జున్ చెప్పేశాడు కాబట్టి.. ఇకనుండైనా అల్లు అర్జున్ & టీం సినిమా ఇంత కలెక్ట్ చేసింది, ఇన్ని రికార్డ్స్ క్రియేట్ చేసింది అని పోస్టర్స్ వదలకుండా ఉంటే బెటర్. లేదంటే.. చిత్ర కథానాయకుడికి స్టేట్మెంట్ కి చితబృందం చేసే పనులకీ సంబంధం లేదని మళ్ళీ ట్రోల్స్ వచ్చే అవకాశం ఉంది.


సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus