బన్నీ మోసగాళ్లపై ఎందుకు మనసు పారేసుకున్నారో?

  • October 3, 2020 / 07:38 AM IST

టాలీవుడ్ లో కొద్దిరోజులుగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అది అల్లు అర్జున్ మోసగాళ్లు మూవీలో క్యామియో రోల్ చేస్తున్నారని. మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ ఇండో అమెరికన్ మూవీలో అల్లు అర్జున్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేయనున్నారని వార్తలు రావడం జరిగింది. ఐతే అది అధికారికమే అని నేడు స్పష్టత వచ్చింది. మోసగాళ్లు మూవీలో బన్నీ పోలీస్ రోల్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు.

ఆ మోసగాళ్లు ఎవరో, వారు చేసిన స్కామ్ ఎంత పెద్దదో బయటపడనున్న అల్లు అర్జున్ అని అధికారిక ప్రకటన విడుదల చేశారు. దీనితో మోసగాళ్లు మూవీలో బన్నీ చేయనున్న ఆ పోలీస్ రోల్ ఏ రేంజ్ లో ఉండనుందో అని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ ఘీ చిన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ స్కామ్ ఆధారంగా తెరకెక్కుతుంది. స్కామ్ చేసే ఐ టి ప్రొఫెషనల్స్ గా మంచు విష్ణు, కాజల్ కనిపించనున్నారని సమాచారం.

మరో విశేషం ఏమిటంటే విష్ణు, కాజల్ అన్నా, చెల్లెలు పాత్ర చేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్యామియో రోల్ చేస్తున్న అల్లు అర్జున్, కాజల్ మధ్య మంచి రొమాంటిక్ సన్నివేశం కూడా సెట్ చేసే అవకాశం లేకపోలేదు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఈ మూవీలో మరో కీలక పాత్ర చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతుండగా, పలు భాషలలో విడుదల కానుంది.

Most Recommended Video

బిగ్‌బాస్‌లో రోజూ వినే గొంతు… ఈయనదే!
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!
కోలీవుడ్లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus