ఫ్యాన్స్ కు బన్నీ బర్త్‌డే గిఫ్ట్!!!

మెగా ఫ్యాన్స్ కు మెగా హీరో సూపర్ న్యూస్…మెగా ఫ్యాన్స్ కు మెగా మేనల్లుడు బర్త్‌డే గిఫ్ట్….అవును ఈరోజు మన స్టైలిష్ స్టార్ బన్నీ అభినానులకు  పండగ…దానికి కారణం ఆయన బర్త్‌డే కావడమే….అయితే అదే క్రమంలో బన్నీ ఇదే రోజు ఇంకో గిఫ్ట్ ను అభిమానులకు అందజేశాడు అదేంటి అంటే…ఒకసారి ఈ కధ చదవండి మీక్ అర్ధం అవుతుంది…విషయంలోకి వెళితే…టాలీవుడ్ లో మెగాస్టార్ శిబిరం నుంచి వచ్చిన హీరోలు అందరూ ఆయన జపం చెయ్యకపోతే మనుగడ కష్టం అన్న ఆలోచనలో ఎప్పుడూ ఆయన గురించే చెప్పుకుంటూ కాలం గడిపేస్తున్నారు…ఇదిలా ఉంటే వీళ్ళందరిలో బన్నీ మాత్రం ప్రత్యేకం అనే చెప్పాలి…బన్నీ కరియర్ మొదలు పెట్టిన కాలంలో తొలి రోజుల్లో చిరు ఇమేజ్ ను ఉపయోగించుకున్నాడు, అయితే కాలక్రమేణా తనకంటూ ఒక ఇమేజ్ ను ఏర్పరుచుకుని…తనకంటూ ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకున్నాడు…గత కొంతకాలంగా అటు చిరు ఫ్యాన్స్ తోనూ…ఇటు పవన్ ఫ్యాన్స్ తోనూ కాస్త దూరంగా ఉంటున్న బన్నీ ఒకరకంగా చెప్పాలి అంటే మెగా అభిమానులకు కాసత దూరం అయాడు…అయితే సోషియల్ నెట్‌వర్కింగ్ సైట్స్ లో బన్నీ అభిమానులు, మెగా అభిమానులు మాత్రం ఒకరిపై మరొకరు వైరం పెంచుకుంటూ గొడవలు పడుతూ ఉన్నారు.

ఇదంతా పక్కన పెడితే…ఈరోజు బన్నీ పుట్టిన రోజు కావడంతో అభిమానులకు మంచి గిఫ్ట్ ఇచ్చాడు బన్నీ..అదేంటి అంటే…కొన్ని నెలలుగా అందరూ అనుకుంటున్న ఒక మూవీ ప్రాజెక్ట్ ను తన పుట్టినరోజునాడు ప్రకటించాడు బన్ని. వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేయబోయే లేటెస్ట్ మూవీ ఈరోజు ప్రకటించాడు. లగడపాటి శ్రీధర్ బన్నీ వాసు నిర్మాణంలో నిర్మించబోతున్న కొత్త సినిమా అధికారిక ప్రకటన ఈరోజు విడుదల చేసారు. మరొక ఆశ్చర్యకరమైన ట్విస్ట్ ఏమిటంటే ఈసినిమాను మెగా బ్రదర్ నాగేంద్ర బాబు సమర్పిస్తున్నాడు. అయితే ఇతవరకూ బాగానే ఉన్నా….ఈ సినిమా టైటిల్ విషయంలో మాత్రం…. ముందు అనుకున్నట్లుగా ‘నా పేరు సూర్య’ అనే టైటిల్ ని మాత్రం ఈమూవీకి ప్రకటించలేదు. మొత్తంగా చూసుకుంటే చిరు అనే ఇమేజ్ అన్న పదం లేకుండా బన్నీ ఎదగాలి అని అనుకుంటున్నాడు అని క్లియర్ గా అర్ధం అవుతుంది…చూద్దాం ఏం జరుగుతుందో.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus