Chiranjeevi – Trivikram: ‘ఆచార్య’కు జరిగింది.. ఇప్పుడు గురూజీ సినిమాకు జరుగుతుందా?

చిరంజీవి – త్రివిక్రమ్‌.. ఈ కాంబినేషన్‌ ఆలోచన ఇప్పటిది కాదు. కొన్నేళ్ల నుండి నిర్మాతలు ఈ కాంబోని సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇదిగో, అదిగో అంటూ కొన్ని అనౌన్స్‌మెంట్‌లు వచ్చినా ఏదీ ఓకే అవ్వలేదు. అందులో ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత సుబ్బరామిరెడ్డి కూడా ఉన్నారు. చిరంజీవి – పవన్‌ కల్యాణ్‌ – త్రివిక్రమ్‌ కాంబోలో ఆయనో సినిమా అనౌన్స్‌ చేశారు. కానీ అవ్వలేదు.

Chiranjeevi – Trivikram

అయితే, ఎట్టకేలకు ఇప్పుడు డీవీవీ దానయ్య ఆ ప్రయత్నంలో చేశారు. త్రివిక్రమ్‌ శిష్యుడు వెంకీ కుడుములతో చిరంజీవి సినిమా చేద్దాం అనుకున్న ఆయన.. ఇప్పుడు గురూజీతోనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. హారిక హాసిని – ఎన్టీఆర్‌ కాంబోలో చేస్తారు అని చెప్పిన ‘గాడ్‌ ఆఫ్‌ వార్‌’ సినిమా ఇప్పటికిప్పుడు ముందుకెళ్లే పరిస్థితులు లేకపోవడంతో.. ఆ గ్యాప్‌లో చిరు సినిమా చేసేయాలని అనుకుంటున్నారట.

అయితే, ఈ సినిమాకు సంబంధించి ఓ లైన్‌ బయటకు వచ్చింది. ఈ కథను తొలుత త్రివిక్రమ్‌.. రామ్‌చరణ్‌ కోసం రాసుకున్నారని, కానీ ఇప్పుడు చిరంజీవితో చేస్తున్నారు అని అంటున్నారు. అదే జరిగితే ‘ఆచార్య’కు జరిగినట్టుగానే ఇప్పుడూ జరుగుతోంది అని చెప్పొచ్చు. ఆ సినిమాకు ముందు కొరటాల – చరణ్‌ కాంబోనే సెట్‌ అయింది. అయితే ఫైనల్‌గా చిరంజీవి వచ్చారు. అప్పుడు ఇబ్బందికర ఫలితం వచ్చింది. ఇప్పుడేమవుతుందో చూడాలి.

పూర్తిస్థాయి వినోదాత్మకంగా త్రివిక్రమ్‌ ఓ లైన్‌ అనుకున్నారట. ఈ మేరకు స్టోరీ పాయింట్‌ని చిరంజీవికి చెప్పారట కూడా. పూర్తి స్థాయి కథను త్వరలోనే నెరేట్‌ చేస్తారని, వన్స్‌ అంతా ఓకే అనుకుంటేనే ఈ సినిమాను అనౌన్స్‌ చేస్తారని చెబుతున్నారు. ఈ లెక్కన డీవీవీ దానయ్య కోరిక కూడా నెరవేరబోతోంది అని చెప్పొచ్చు. ‘గాడ్‌ ఆఫ్‌ వార్‌’ సినిమా చేయకుండా అనిల్‌ రావిపూడి సినిమాను ఎన్టీఆర్‌ ఇటీవల అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈఎన్ఈ రిపీట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus