ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని సన్ పిక్చర్స్ సంస్థ దాదాపు రూ.700 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తుంది. షూటింగ్ 40 శాతం కంప్లీట్ అయిపోయింది అంటున్నారు. అల్లు అర్జున్ పార్ట్ షూటింగ్ అయితే 60 శాతం కంప్లీట్ అయిపోయింది అనే టాక్ కూడా వినిపిస్తోంది.
సో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా కోసం కూడా స్క్రిప్టులు వింటూ ఉండాలి. ఈ క్రమంలో నెక్స్ట్ సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఉంటుంది అనే టాక్ కూడా గట్టిగా వినిపించింది. అల్లు అర్జున్ తో బోయపాటి చేసిన ‘సరైనోడు’ పెద్ద హిట్టు. ఆ సినిమాతోనే అల్లు అర్జున్ కి మాస్ ఫాలోయింగ్ పెరిగింది.అందుకే ఈ కాంబోలో ఇంకో సినిమా వస్తే బాగుంటుందని అంతా ఆశించారు.
అల్లు అర్జున్ అభిమానులు కూడా బోయపాటితో ఇంకో సినిమా చేయమని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. గీతా ఆర్ట్స్ సంస్థ పై బోయపాటి అడ్వాన్స్ కూడా అందుకున్నారు. అల్లు అరవింద్ కూడా బోయపాటితో ఇంకో సినిమా చేయాలని ఉందని పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇక బోయపాటి కూడా అల్లు అర్జున్ కోసం 2 స్క్రిప్టులు కూడా రెడీ చేశాడు.
కానీ బోయపాటి లేటెస్ట్ మూవీ ‘అఖండ 2’ ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయడం లేదు. గత సినిమా ‘స్కంద’ కూడా పెద్ద డిజాస్టర్. మరోపక్క బన్నీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్లతో సూపర్ ఫామ్లో ఉన్నాడు. అందుకే ఇప్పుడు బోయపాటి- అల్లు అర్జున్ కాంబో వద్దని అల్లు అరవింద్ అండ్ టీం ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. కావాలంటే వేరే స్టార్ హీరోతో తమ బ్యానర్లో సినిమా చేద్దామని బోయపాటికి చెప్పేశారట.