బన్నీ అడగకుండానే స్టెప్పేశాడు..!

  • April 11, 2016 / 10:18 AM IST

నిన్న బన్నీ నటించిన ‘సరైనోడు’ సినిమా పాటల విజయోత్సవ వేడుక విశాఖపట్టణం బీచ్ రోడ్ లో అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరింగింది. ఎందరో అభిమానులు మెగా ఫ్యామిలీను చూడడానికి తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో బన్నీ తనకు వైజాగ్ అంటే చాలా ఇష్టమని చెప్పాడు. ఆర్య సినిమా షూటింగ్ సమయంలో వైజాగ్ బీచ్ దగ్గర గ్రాండ్ గా ఓ ఫంక్షన్ చేసుకోవాలని నా స్నేహితుడితో అన్నాను. అప్పుడు తను అలా జరగాలంటే చాలా ఎదగాలని చెప్పాడు. నేను ఆ స్థాయికి ఎదిగానో.. లేదో.. తెలియదు కానీ.. నా కల ఈరోజు నెరవేరడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. సాధారణంగా బన్నీ ఏ ఆడియో ఫంక్షన్ లో స్టెప్పులు వేయడు. యాంకర్స్ బన్నీను డాన్స్ చేయమని ఎంతో ఫోర్స్ చేస్తే తప్ప చేయని బన్నీ ‘సరైనోడు’ ఫంక్షన్ లో మాత్రం తనే స్వయంగా నాకు రెండు స్టెప్స్ వేయాలనుందని చెప్పి.. సాంగ్ అడిగి మరీ పెట్టించుకొని డాన్స్ చేశాడు. బన్నీ వేసిన స్టెప్స్ కు ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus