అల్లు అర్హ ఆసనాలు చూసి షాక్ అయిన అల్లు అర్జున్..!

  • March 21, 2023 / 06:37 PM IST

సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు ఎంతటి క్రేజ్ ఉంటుందో.. స్టార్ కిడ్స్‌కి కూడా అంతే ఫాలోయింగ్ ఉంటుంది.. సూపర్ స్టార మహేష్ బాబు – నమ్రతల కిడ్స్ గౌతమ్, సితార పాప బాగా యాక్టివ్‌గా ఉంటారు.. సితార, డైరెక్టర్ వంశీ పైడిపల్లి కుమార్తె కలిసి సొంతగా ఓ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశారంటేనే అర్థం చేసుకోవచ్చు.. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – స్నేహా రెడ్డిల కిడ్స్ అర్హ – అయాన్ ఇద్దరికీ సంబంధించిన క్యూట్ మూమెంట్స్ అన్నిటినీ స్నేహా సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తుంటారు..

అర్హ ఇప్పటి వరకు తన ముద్దు మాటలతో, చిలిపి చేష్టలతో అందర్నీ ఆకట్టుకుంది.. అలాగే మట్టి వినాయకుడి విగ్రహం తయారు చేయడం.. పిల్లలకి చెస్ నేర్పించి నోబుల్ బుక్ ఎక్కడం వంటి టాలెంట్ చూపించి సర్‌ప్రైజ్ చేసింది.. అర్హతో పాటు బన్నీ ఫ్యామిలీకి సంబంధించిన పిక్స్, వీడియోస్ ఎప్పుడు షేర్ చేసినా కానీ వైరల్ అవుతుంటాయి.. ఆమెను 8.8 మిలియన్ల మంది ఫాలో చేస్తున్నారు.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ బ్యూటిఫుల్ ఇమేజ్ పోస్ట్ చేశారు స్నేహా..

అందులో అల్లు అర్హలోని న్యూ టాలెంట్ చూసి ఫ్యాన్స్, నెటిజన్స్ షాక్ అవుతున్నారు.. ఉదయాన్నే క్లిష్టమైన యోగాసనాలు వేసి తండ్రిని ఆశ్చర్యానికి గురి చేసింది.. తన గారాల పట్టీ యోగాసనాలు వేస్తుంటే బన్నీ మురిసిపోతూ అలా చూస్తూ ఉండిపోయాడు.. ‘బ్రిలియంట్.. వండర్ కిడ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆడియన్స్.. ఇదిలా ఉంటే.. గుణ శేఖర్, సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కించిన హిస్టారికల్ ఫిలిం ‘శాకుంతలం’ తో అల్లు అర్హను బాల నటిగా పరిచయం చేస్తున్నారు..

ఏప్రిల్ 14న విడుదలవుతున్న ఈ మూవీలో ఇంకెలాంటి షాక్ ఇస్తుందో చూడాలి.. బన్నీ – సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సీక్వెల్ ‘పుష్ఫ : ది రూల్’ చేస్తున్నాడు.. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.. ఏప్రిల్ 8న అర్జున్ పుట్టినరోజు సందర్భంగా 3 నిమిషాల టీజర్ రిలీజ్ చేయనున్నారని సమాచారం..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus