‘హుషారు’ చిత్రానికి అల్లు అర్జున్ సాయం..?

ఇటీవల విడుదలయ్యి .. డీసెంట్ హిట్ గా నిలిచిన చిత్రం ‘హుషారు’. ‘ల‌క్కీ మీడియా’, ‘ఆసిన్ మూవీ క్రియేష‌న్స్‌’ ‘హెచ్‌.కె.ఫిలింస్’ కలిసి నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీ హ‌ర్ష కొనుగంటి డైరెక్ట్ చేసాడు. కాలేజ్ లైఫ్, ఫ్రెండ్స్ తో ఉండే రెండు అంశాలు.. మన జీవితంలో ఎటువంటి పాత్ర పోషిస్తుంది అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ‘అందాల రాక్షసి’ ‘అర్జున్ రెడ్డి’ వంటి సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన ర‌ధ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ‘పిచాక్’ ‘ఉండిపోరాదే’ పాటలు ఆడియన్స్ ను బాగా ఆకట్టున్నాయి. ముఖ్యంగా ‘ఉండిపోరాదే’ పాటతోనే ఈ చిత్రానికి మంచి హైప్ ఏర్పడిందనే చెప్పాలి. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు ఆడియన్స్ మాత్రమే కాదు సెల‌బ్రిటీలు కూడా ఫిదా అయిపోతున్నారు.

ఇప్పుడు ఈ లిస్టులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరిపోయాడు. తాజాగా ఈ పాట విన్న అల్లు అర్జున్ ఈ పాట‌కి ఫిదా అయిపోయాడట. విన్న వెంట‌నే ఈ పాట‌కి సంబంధించిన ఒక పోస్ట‌ర్‌ని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసాడు. అంతే కాదు సింగ‌ర్ సిద్ శ్రీరామ్ , సంగీత ద‌ర్శ‌కుడు ర‌ధ‌న్‌ పై ప్ర‌శంస‌ల జల్లు కురిపించాడు. అల్లు అర్జున్ స్పందిస్తూ ‘ఉండిపోరాదే’ పాట చాలా అద్భుతంగా ఉంది. ర‌ధ‌న్ గారి సంగీతం చాలా చాలా బాగుంది. సిద్ శ్రీరామ్ సూపర్ గా పాడారు.. అంటూ పోస్ట్ చేసాడు బన్నీ. అల్లు అర్జున్ ఇలా తన ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో ఈ పాట పై జ‌నాల‌కు మ‌రింత ఆస‌క్తి పెరిగిందనే చెప్పాలి. సోషల్ మీడియాలో చాలా మంది ఈ పాటకి డ‌బ్ స్మాష్ చేస్తుండడంతో ట్రెండింగ్‌గా నిలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus