రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న సినిమా ‘నా పేరు సూర్య’. ఈ సినిమాలో అల్లు అర్జున్ సోల్జెర్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్టు ఇంపాక్ట్ రీసెంట్ గా రిలీజ్ అయి విశేష స్పందన అందుకుంది. రిలీజ్ అయిన తొలి 29 గంటల్లోనే ఆన్‌లైన్‌లో కోటికిపైగా డిజిటల్ వ్యూస్ దక్కించుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. ”మిలటరీ నేపథ్యంలో సాగే కథ ఇది. కుటుంబ బంధాలు, ప్రేమ, భావోద్వేగాలు ఇవన్నీ ఉంటాయి. ఈ సినిమాతో బన్నికి ‘పాన్ ఇండియా’ ఇమేజ్ వస్తుంది. ఎందుకంటే దేశభక్తి అనేది ఓ ప్రాంతానికి సంబంధించిన అంశం కాదు. ప్రతి భారతీయుడు గుండెల్ని తాకే విషయం.
ఈ పాత్రలో అల్లు అర్జున్ నటనకి తప్పకుండా కొత్త అభిమానులు ఏర్పడతారు.” అని వివరించారు. ఇక టీజర్ గురించి వివరిస్తూ.. “టీజర్‌కి వస్తున్న స్పందన చూస్తే సంతోషంగా ఉంది. టీజర్‌లో హీరో గురించి బలంగా చెప్పాలన్నది డైరక్టర్ ఉద్దేశం. అది నెరవేరింది. బన్నీ లుక్, అతని ఎనర్జీ, పాత్రకోసం పడే తాపత్రయం టీజర్‌లో కనిపించాయి. ఈ పాత్ర కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడ్డారు. అదంతా విడుదల తర్వాత తెరపై కనిపిస్తుంది.” అని వివరించారు. బాలీవుడ్ సంగీత దర్శకులు విశాల్, శేఖర్ సంగీతమే అందిస్తున్న ఈ చిత్రంలో చిత్రంలో శరత్ కుమార్ ఓ కీలక రోల్ పోషిస్తున్నారు. అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 27 న రిలీజ్ కానుంది.