Allu Arjun: అభిమాని తండ్రికి వైద్యం చేయించిన అల్లు అర్జున్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

సాధారణంగా సినిమా సెలబ్రిటీలు తమ అభిమానులకు ఏదైనా ఆపద వచ్చిందంటే ఆ విషయం వారి దృష్టికి వెళితే తక్షణమే స్పందించి వారికి తమ వంతు సాయం చేస్తూ ఉంటారు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఈ విధంగావారి అభిమానులు ఆపదలో ఉంటే వారిని ఆదుకున్న సందర్భాలు ఉన్నాయి అయితే కొందరు పైకి చెప్పుకొని సహాయ సహకారాలు చేస్తే మరి కొందరు గుట్టు చప్పుడు కాకుండా ఇలాంటి సహాయ సహకారాలు చేస్తుంటారు ఇలాంటి కోవకు చెందిన వారే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.

అల్లు అర్జున్ తన అభిమానులకు ఏదైనా ఆపద ఉంది అని తన దృష్టికి వెళ్తే తప్పనిసరిగా వారిని ఆదుకొని అండగా నిలబడతారు. ఇలా ఎంతోమంది అభిమానులకు అండగా నిలిచిన అల్లు అర్జున్ తాజాగా ఓ అభిమాని తండ్రి అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రి ఖర్చులకు డబ్బులు లేక విలవిలలాడుతున్న ఆ అభిమానికి బన్నీ ఆర్థిక సహాయం చేసి అండగా నిలబడ్డారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అర్జున్ కుమార్ అనే ఓ అభిమాని తండ్రి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు

అయితే తనకు చికిత్స చేయించడానికి దాదాపు రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది. అంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో కొందరు బన్నీ అభిమానులు అర్జున్ కుమార్ తండ్రి పరిస్థితి వివరిస్తూ సోషల్ మీడియా వేదికగా తనకు సహాయం చేయాలని కోరారు అయితే ఈ విషయం గీత ఆర్ట్స్ కంటెంట్ హెడ్ శరత్ చంద్ర నాయుడు దృష్టికి వెళ్ళింది. దీంతో ఆయన స్వయంగా బన్నీని కలిసి పరిస్థితి వివరించారు. ఈ విధంగా తన అభిమాన తండ్రి వైద్య ఖర్చులకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారని తెలియడంతో వెంటనే అల్లు అర్జున్ తనకు ఆర్థిక సహాయం చేసే అండగా నిలబడ్డారు.

ఇలా తన అభిమాన హీరో తన తండ్రి చికిత్స కోసం సహాయం చేయడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేసిన అర్జున్ కుమార్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. నన్ను గుర్తు పెట్టుకున్నావ్… నా ఫోటో చూడగానే తెలుసని చెప్పారు…ఆనందంతో ఏడ్చేసాను అన్న నాకు నా కుటుంబానికి అండగా ఉన్నందుకు జీవితాంతం మీకు రుణపడి ఉంటా అంటూ అర్జున్ కుమార్ అల్లు అర్జున్ చేసిన సహాయంకి కృతజ్ఞత తెలుపుతూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus