Allu Arjun: అప్‌సెట్‌ అయిన అల్లు అర్జున్.. కారణమేంటంటే..?

నేడు టాలీవుడ్ స్టార్ హీరో బన్నీ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. బన్నీ బర్త్ డే సందర్భంగా నిన్న పుష్ప సినిమా టీజర్ రిలీజైంది. టీజర్ రూపంలో పుష్ప చిత్రయూనిట్ అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చింది. పుష్ప టీజర్ కు యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. బన్నీ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొని అభిమానుల్లో జోష్ నింపేలా మాట్లాడారు. అయితే ఈ ఈవెంట్ లో బన్నీ మొబైల్ పోయిందని సమాచారం.

ఎంతో ఇష్టమైన ఫోన్ పోగొట్టుకోవడంతో బన్నీ అప్ సెట్ అయ్యాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. పుష్ప టీజర్ ఈవెంట్ కు బన్నీ ఫ్యాన్స్ భారీ సంఖ్యలో వచ్చిన సంగతి తెలిసిందే. బన్నీని కలవాలనే ఆలోచనతో కొంతమంది ఫ్యాన్స్ బన్నీని చుట్టుముట్టారు. ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయడం బౌన్సర్స్ వల్ల కూడా కాలేదు. ఆ సమయంలోనే బన్నీ మొబైల్ పోయి ఉండవచ్చని తెలుస్తోంది. అయితే బన్నీ టీమ్ మాత్రం ఫోన్ పోయిన విషయం గురించి స్పష్టతనివ్వడం లేదు. బన్నీ ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ ఇంతమంది అభిమానుల అభిమానం సంపాదించుకున్న తాను లక్కీ అని పేర్కొన్నారు.

ఫ్యాన్స్ కేరింతలు పెట్టేలా పుష్ప సినిమాలలోగా రియల్ లైఫ్ లో కూడా తాను తగ్గనని బన్నీ చెప్పారు. పుట్టినరోజు వేడుకను ఫ్యాన్స్ తో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని బన్నీ తెలిపారు. అభిమానులతో బర్త్ డే వేడుక జరుపుకోవడాన్ని మించి సంతోషం మరేదీ ఉండదని అల్లు అర్జున్ పేర్కొన్నారు. ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్ ఈ సినిమా తరువాత కొరటాల శివ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించబోతున్నారని సమాచారం. బన్నీ వేణుశ్రీరామ్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించాల్సి ఉండగా వకీల్ సాబ్ హిట్టైతే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus