Allu Arjun: బన్నీ ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త.. అల్లు అర్జున్ రూట్ మార్చారా?

టాలీవుడ్ స్టార్ హీరోలైన ప్రభాస్ (Prabhas) , జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించాలనే ఆలోచనతో ఒకే సమయంలో రెండు లేదా మూడు సినిమాలలో నటిస్తున్నారు. ఈ హీరోలు సినిమా సినిమాకు లుక్ విషయంలో వైవిధ్యం చూపిస్తూనే సక్సెస్ కోసం అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ హీరోలను ఫాలో అయ్యే హీరోల జాబితాలో తాజాగా అల్లు అర్జున్ (Allu Arjun) కూడా చేరారని తెలుస్తోంది. పుష్ప ది రూల్ సినిమాను పూర్తి చేసిన తర్వాత వేగంగా సినిమాలలో నటించే విధంగా బన్నీ అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది.

బన్నీ ప్లాన్ అదుర్స్ అని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. బన్నీ తర్వాత సినిమాలలో ఒక సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) డైరెక్షన్ లో తెరకెక్కుతుండగా మరో సినిమా అట్లీ (Atlee) డైరెక్షన్ లో తెరకెక్కనుంది. ఈ రెండు సినిమాలు దాదాపుగా ఒకే సమయంలో మొదలుకానున్నాయని తెలుస్తోంది. పుష్ప (Pushpa) సిరీస్ సినిమాలకు బన్నీ దాదాపుగా నాలుగేళ్ల సమయం కేటాయించిన నేపథ్యంలో ఇకపై వేగంగా సినిమాలలో నటించేలా అల్లు అర్జున్ ప్లాన్ ఉందని తెలుస్తోంది.

రెమ్యునరేషన్ పరంగా సైతం టాప్ లో ఉన్న బన్నీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తర్వాత స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లు దక్కేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తుండగా బన్నీ రాజమౌళి (Rajamouli) కాంబినేషన్ లో సినిమా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

రాజమౌళి మహేష్ సినిమాను పూర్తి చేసిన తర్వాత బన్నీతో సినిమాను ప్రకటిస్తారేమో చూడాల్సి ఉంది. రాజమౌళి సపోర్ట్ లేకుండానే పాన్ ఇండియా ఇమేజ్ సాధించిన అల్లు అర్జున్ జక్కన్న సపోర్ట్ ఉంటే సాధించే సంచలనాలు మామూలుగా ఉండవని ఫ్యాన్స్ చెబుతున్నారు. సినిమా సినిమాకు బన్నీ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus