‘పుష్ప’ చిన్న టీజర్ లాంటిదేనట.. బాలీవుడ్ స్కెచ్ భారీగానే ఉంది..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మెల్ల మెల్లగా తన మార్కెట్ ను సౌత్ తో పాటు నార్త్ లో కూడా పెంచుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే అతనికి మలయాళంలో పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బన్నీ సినిమాలు అక్కడి స్టార్ హీరోలతో సమానంగా వసూళ్లు రాబడుతుంటాయి. ఇక ఈ ఏడాది విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రం పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాకపోయినా.. ఆ స్థాయిలో విజయం సాధించింది. బాలీవుడ్ లో కూడా బన్నీకి భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

టైగర్ ష్రాఫ్, రోహిత్ శెట్టి వంటి స్టార్లు ఈ విషయాన్ని ఓపెన్ గానే చెప్పుకొచ్చారు. బన్నీ సినిమాల హిందీ వెర్షన్లకు యూట్యూబ్లో 200మిలియన్ వ్యూస్ నమోదవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ‘పుష్ప’ చిత్రాన్ని బాలీవుడ్లో కూడా భారీ స్థాయిలో విడుదల చెయ్యాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సౌత్ లోని నాలుగు భాషలతో పాటు హిందీలో కూడా ఏకకాలంలో విడుదల చెయ్యబోతున్నారని తెలుస్తుంది.

ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ చిత్రాన్ని భారీగా ప్రమోట్ చేసేందుకు ఓ టీంను కూడా ఏర్పాటు చేసినట్టు టాక్.’పుష్ప’ కు సంబంధించిన ప్రమోషన్లు తెలుగుతో పాటు హిందీలో కూడా ఒకే సారి మొదలుకాబోతున్నాయట. అయితే తెలుగులో లిరికల్ సాంగ్స్ ను విడుదల చేస్తే.. హిందీలో మాత్రం ఎక్కువ నిడివిగల వీడియో సాంగ్స్ ను విడుదల చేస్తారని టాక్. ప్రస్తుతం ‘పుష్ప’ షూటింగ్ ఈస్ట్ గోదావరి జిల్లాలో జరుగుతుంది.

Most Recommended Video

ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?
ఈ 12 మంది ఆర్టిస్ట్ ల కెరీర్.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే మొదలయ్యింది..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus