సినీ సెలబ్రిటీలు ఒకప్పుడు సినిమాల ద్వారానే సంపాదించేవారు. కానీ మెల్లమెల్లగా ఇతర వ్యాపారాలు, వాణిజ్య ప్రకటనల్లో నటించి కూడా కోట్లు సంపాదిస్తున్నారు. టాలీవుడ్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు ఒక్క యాడ్స్ ద్వారానే కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ కూడా బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ కనిపించారు. ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా పలు బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.
తాజాగా ఆయన చేతుల్లోకి మరో బ్రాండ్ వచ్చి చేరింది. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోకి బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు అల్లు అర్జున్. ఇటీవల హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో ఈ యాడ్ కి సంబంధించిన షూటింగ్ ను నిర్వహించారు. తాజాగా ఈ యాడ్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో బన్నీతో మరో నటుడు సుబ్బరాజ్ కూడా కనిపించాడు. వీరిద్దరి మధ్య ఓ ఫైట్ సీన్ జరుగుతుండగా..
బన్నీ సుబ్బరాజ్ కు ఒక్క కిక్కుతో గాల్లో ఎగిరేలా కొడతాడు. ఆ షాట్ స్లో మోషన్ లో ఉండగా.. ‘బన్నీ నన్ను కొంచెం తొందరగా కింద పడేయవా.. గోంగూర మటన్ తినాలని ఉంది. కింద పడేలోగా రెస్టారెంట్లు క్లోజ్ అవుతాయి’ అని డైలాగ్ కొడతాడు సుబ్బరాజ్. దానికి బన్నీ.. ‘ఎప్పుడు ఏం కావాలన్నా జొమాటో ఉందిగా’ అని అంటాడు. ‘ఏం కావాలన్నా.. ఎప్పుడు కావాలన్నా జొమాటో అందిస్తుంది సూపర్ ఫాస్ట్‌గా.. మనసు కోరితే తగ్గేదేలే’ అంటూ తనదైన స్టైల్ లో చెబుతాడు బన్నీ.
ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాస్త కామెడీ కూడా జోడించడంతో యూనిక్ గా అనిపిస్తోంది. ఇందులో బన్నీ లుక్ కూడా ఆకట్టుకుంటుంది.
manasu korithe, thaggedele! 🔥 @alluarjun pic.twitter.com/i30UGZEQKD
— zomato (@zomato) February 4, 2022
Most Recommended Video
అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!