మారుతి తదుపరి చిత్రం అల్లు అర్జున్ తో ??
- April 12, 2016 / 10:36 AM ISTByFilmy Focus
నిజానికి మారుతి.. మెగా ఫ్యామిలీ కి అత్యంత సన్నిహితుడు. దర్శకుడు కావడానికి ముందు నుంచి మెగా ఫ్యామిలీ తో అతనికి మంచి అనుబంధముంది. ముఖ్యంగా అల్లు అర్జున్ తో మారుతికి మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. కాకపోతే.. సినిమాల విషయంలో మొహమాటాలకు పోవడం అల్లు అరవింద్ కి అస్సలు ఇష్టం ఉండదు. “తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే” అన్న చందంగా వ్యవహరిస్తారాయన.
అందుకే.. “ఈ రోజుల్లో, బస్ స్టాప్, ప్రేమ కథాచిత్రం” వంటి చిత్రాలతో మారుతి ప్రూవ్ చేసుకున్నాకే అతనికి అల్లు శిరీష్ తో “కొత్త జంట” సినిమా రూపొందించే అవకాశం ఇచ్చారాయన. అయితే ఆ సినిమా ఆశించిన రీతిలో విజయం సాధించ లేదు. దాంతో పట్టుబట్టి నానీతో అదే బ్యానర్ లో “భలే భలే మగాడివోయ్” చిత్రం తీసి తన సత్తా చాటుకున్నాడు మారుతి. ముఖ్యంగా “భలే భలే మగాదివోయే” చిత్రం అప్పటివరకు “బూతు డైరెక్టర్” అన్న ఇమేజ్ ను పూర్తిగా చెరిపేసింది.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus











