‘పుష్ప’ నిర్మాతలకి తలనొప్పిగా మారిన విజయ్ సేతుపతి..!

  • May 16, 2020 / 12:28 PM IST

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘పుష్ప’ చిత్రంలో విజయ్ సేతుపతి కూడా నటించబోతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘మైత్రి మూవీ మేకర్స్’ వారే నిర్మాతలు.. మరో పక్క వీళ్ళు ‘ఉప్పెన’ అనే సినిమా కూడా నిర్మిస్తున్నారు. మెగా మేనల్లుడు సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ చిత్రంలో నెగిటివ్ రోల్ పోషిస్తున్నాడు విజయ్ సేతుపతి. అయితే ‘పుష్ప’ చిత్రంలో కూడా ఓ కీలక పాత్రకు విజయ్ సేతుపతి అయితే బాగుంటుంది అని నిర్మాతలు భావిస్తున్నారు అంటూ ప్రచారం జరిగింది.

దానికి విజయ్ సేతుపతి కూడా ఒప్పుకున్నాడట. కానీ కొన్ని షరతులకు ఓకే అంటేనే నటిస్తాను అని చెప్పాడట. ముందుగా అతనికి 8 కోట్ల పారితోషికం కావాలని డిమాండ్ చేసాడట. అందుకు నిర్మాతలు ఒప్పుకున్నారు. అయితే తను తెలుగులో నటించే ఈ సినిమాలను తమిళంలో విడుదల చెయ్యకూడదు అని.. ఒక వేళ తమిళంలో విడుదల చెయ్యాలి అనుకుంటే.. ఆ వెర్షన్ కు వేరే నటుడుని పెట్టుకోవాలి అంటూ విజయ్ సేతుపతి తెలిపాడట.

దీనికి నిర్మాతలు షాక్ అయ్యారట.. ‘తమిళంలో కూడా మా సినిమాని మార్కెట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే కదా.. అంత పారితోషికం ఇవ్వడానికి రెడీ అయ్యాం’ అంటూ విజయ్ సేతుపతిని ప్రశ్నించారని తెలుస్తుంది. అయినా విజయ్ సేతుపతి తగ్గడం లేదు అని ఇన్సైడ్ టాక్. మరేమవుతుందో చూడాలి. ఇక ‘పుష్ప’ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus