Allu Arjun: ఆ కాలేజ్ బెస్ట్ అంటున్న అల్లు అర్జున్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు యూత్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. అల వైకుంఠపురములో సినిమా తర్వాత బన్నీకి ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ పెరిగింది. ఇప్పటికే బన్నీ పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుండగా బన్నీ ఖాతాలో తాజాగా మరో బ్రాండ్ చేరింది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో విద్యారంగంలో శ్రీచైతన్య విద్యాసంస్థకు భారీస్థాయిలో పాపులారిటీ ఉందనే సంగతి తెలిసిందే. దాదాపుగా 36 సంవత్సరాల నుంచి ఈ విద్యాసంస్థ మనుగడ సాగిస్తుండటం గమనార్హం.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్థకు సంబంధించిన స్కూళ్లు, ఇంటర్ కాలేజీలు ఉన్నాయి. ఈ కార్పొరేట్ విద్యాసంస్థను ప్రస్తుతం బన్నీ ప్రమోట్ చేస్తున్నారు. “సక్సెస్ కొరకు శ్రీ చైతన్యను ఎంచుకోవడంలో తగ్గేదేలే” అంటూ బన్నీ శ్రీచైతన్య సంస్థను ప్రమోట్ చేస్తున్నారు. ఐఐటీ సక్సెస్ కొరకు శ్రీచైతన్య బెస్ట్ అని బన్నీ ప్రచారం చేస్తున్నారు. బన్నీ ప్రమోషన్స్ వల్ల ఈ విద్యాసంస్థకు తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ పెరిగే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు.

మరోవైపు ఈ ఏడాది డిసెంబర్ లో బన్నీ నటించిన పుష్ప పార్ట్1 థియేటర్లలో రిలీజ్ కానుంది. బన్నీకి జోడీగా రష్మిక ఈ సినిమాలో గిరిజన యువతి పాత్రలో నటిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా రికార్డు స్థాయిలో థియేటర్లలో రిలీజ్ కానుందని తెలుస్తోంది. ప్రేక్షకుల నుంచి ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది. సునీల్, ఫహద్ ఫాజిల్, అనసూయ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus