ఎవరూ కోరుకోని, ఎవరూ ఊహించని ఇబ్బందుల్లో పడ్డాడు ప్రముఖ కథానాయకుడు రామ్‌చరణ్. ‘పెద్ది’ సినిమాకు సంబంధించి ఆయన ఊహించని చిక్కుల్లో పడ్డాడు. నిజానికి ఆ చిక్కులు ఆయనకు కానీ, ఆయన అభిమానులకు కానీ భయపెట్టేవో, బాధపెట్టేవో కావు. ఇంకాస్త మజానిచ్చేవి, ఇంకాస్త ఊపునిచ్చేవి. అవే ‘ఓజీ’, ‘మన శంకరవరప్రసాద్ గారు’. అవును ఈ రెండు సినిమాలు రామ్‌చరణ్ తీపి కష్టాలను ఇస్తున్నాయి. ‘ఓజీ’ వచ్చినప్పుడు నెక్స్ట్ చిరంజీవి వస్తున్నారు.. ఆయన మీద సినిమా విజయ భారం ఎక్కువగానే ఉంటుంది అన్నారంతా.
అనుకున్నట్లుగా ఆ సినిమా వచ్చింది.. చాలామంది ఊహించినట్లుగానే భారీ విజయం అందుకుంది. హిట్ కోసం థియేటర్‌కి వెళ్లిన ఫ్యాన్‌కి బ్లాక్‌బస్టర్ ఇచ్చి కడుపు పింపేశారు చిరంజీవి – అనిల్ రావిపూడి. దీంతో ఇప్పుడు అందరి చూపు రామ్‌చరణ్ మీద పడింది. ఎందుకంటే మరో రెండు నెలల్లో చరణ్ ‘పెద్ది’ రావాల్సి ఉంది. ఆ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నా.. ఇప్పుడు రెండు పెద్ద విజయాలు అందుకున్న తర్వాత మెగా ఫ్యామిలీ నుండి రాబోతున్న రాబోతున్న సినిమా అనే పెద్ద అంచనా మొదలైంది.
మార్చి 27న ‘పెద్ది’ సినిమాను రిలీజ్ చేస్తామని టీమ్ చాలా నెలల క్రితమే ప్రకటించింది. ఆ మేరకు సినిమా పనులు, ప్రచారం షురూ చేస్తున్నాయి. ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా ఉందని ఇప్పుడు ‘పెద్ది’ సినిమా ప్రచారం ఆపేశారు. త్వరలో రీస్టార్ట్ చేస్తారు. అప్పుడు వచ్చే రెండో పాట తొలిపాట ‘చికిరి చికిరి’కి మించి ఉంటుంది అని అంటున్నారు. ఈ పాటను జనవరి 26కి విడుదల చేస్తారని సమాచారం. కేవలం రామ్‌చరణ్ మీదనే ఆ పాటను ఢిల్లీలో చిత్రీకరించిన సన్నివేశాలు ఉంటాయని అంటున్నారు.
ప్రస్తుతానికి వస్తున్న సమాచారం ప్రకారం అయితే.. ఈ సినిమాలో చరణ్ ఆట కూలీగా కనిపిస్తాడు. ఉత్తరాంధ్రలో ఓ కొండ ప్రాంతంలో జీవిస్తున్న పెద్ది ఎందుకు దిల్లీ వెళ్లాడు, అక్కడకు వెళ్లి ఏం చేశాడు. అతని విగ్రహం దేశ రాజధానిలో పెట్టేంతలా ఏం సాధించాడు అనేదే సినిమా కథ.