టాలీవుడ్లో ఏ దర్శకుడు హిట్ కొట్టినా.. పిలిచి మరీ అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకునేది అల్లు అరవిందే అనడంలో సందేహం లేదు. కాకపోతే ఆయన పెద్ద సినిమాల దర్శకుల జోలికి వెళ్ళరు. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలతో హిట్లు కొట్టిన దర్శకులను మాత్రమే లాక్ చేస్తారు.పెద్ద హిట్లు కొట్టిన దర్శకులు అయితే ఎక్కువ అడ్వాన్స్ అడుగుతారనో ఏమో..! అయితే వాళ్ళ అబ్బాయి అల్లు అర్జున్ మాత్రం ఇందుకు పూర్తిగా వ్యతిరేకం.
ఏ మిడ్ రేంజ్ దర్శకుడు అయితే పెద్ద బ్లాక్ బ్లాక్ బస్టర్ కొట్టాడో వాళ్ళని లాక్ చేస్తూ ఉంటాడు. ‘గీత గోవిందం’ సినిమా కథ ముందుగా అల్లు అర్జున్ కు చెబితే చేయలేదు. కానీ ఆ సినిమా పెద్ద హిట్ అయ్యాక.. పరశురామ్ కు ‘సినిమా చేద్దాం’ అని చెప్పాడు.కానీ ‘సర్కారు వారి పాట’ యావరేజ్ గా ఆడడంతో బన్నీ అతని వైపు చూడలేదు. అలాగే ‘మహానటి’ తో పెద్ద హిట్ కొట్టిన నాగ్ అశ్విన్ తో ఓ సినిమా చేద్దామని చెప్పాడు.
అది ‘ప్రాజెక్ట్ కె’ రిజల్ట్ ను బట్టి ఉంటుంది. తాజాగా సందీప్ రెడ్డి వంగాతో బన్నీ.. ఓ పాన్ ఇండియా ప్రాజెక్టుని అనౌన్స్ చేశాడు. ఇది అల్లు అర్జున్ కెరీర్లో ఎన్నో చిత్రంగా రూపొందుతుందో తెలీదు. నెంబర్ కూడా మెన్షన్ చేయకుండా ప్రాజెక్టు అనౌన్స్ చేశారు. ఇంకో విచిత్రం ఏంటి అంటే.. కథ లేకుండానే, ఈ ప్రాజెక్టుకి బన్నీ ఓకే చెప్పాడు. కాబట్టి సందీప్ బాలీవుడ్లో తీస్తున్న ‘యానిమల్’ హిట్ అయితేనే ఈ ప్రాజెక్టు ఓకే అవ్వుద్ది.
ప్రస్తుతానికి నామమాత్రంగానే ఈ ప్రాజెక్టుని అనౌన్స్ చేశారు. నిజానికి ‘అర్జున్ రెడ్డి’ కథని ముందుగా అల్లు అర్జున్ కు చెప్పాడు సందీప్. అది అతనికి యాప్ట్ అయ్యే సినిమా అని బాలీవుడ్ మీడియా ముందు కూడా ఇప్పటికీ చెబుతుంటాడు. బహుశా అందుకే బన్నీ సందీప్ తో సినిమా అనౌన్స్మెంట్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు బి-టౌన్ లో కూడా సందీప్ – బన్నీ ప్రాజెక్టు గురించి గట్టిగా మాట్లాడుకుంటున్నారు. ఇది ‘పుష్ప 2’ ప్రమోషన్ కి బాగా ఉపయోగపడే ఛాన్స్ ఉంది.