Allu Arjun, Harish Shankar: పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా డైలాగ్ వెనుక ఇంత స్టోరీ ఉందా?

అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పుష్ప.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఈయనకు ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టింది. పాన్ ఇండియా స్థాయిలో అల్లు అర్జున్ కి విపరీతమైన అభిమానులను కూడా సంపాదించి పెట్టింది.ఇకపోతే ఈ సినిమాలో ప్రతి ఒక్క డైలాగ్ ఎంతో అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి చిన్న పిల్లల సైతం ఈ డైలాగులు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ముఖ్యంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప అంటే ఫ్లేవర్ అనుకుంటివా.. ఫైర్ అంటూ చెప్పే డైలాగ్ సూపర్ హిట్ అయింది అని చెప్పాలి. అయితే ఈ డైలాగ్ వెనక ఉన్న స్టోరీని అల్లు అర్జున్ తాజాగా బయటపెట్టారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ మొదలుకాకుండానే డైరెక్టర్ హరీష్ శంకర్ ని కలిసారట సినిమా గురించి మాట్లాడుతూ సినిమా టైటిల్ పుష్ప అని భావిస్తున్నామని చెప్పారట.

ఈ డైలాగ్ విన్నటువంటి హరీష్ శంకర్ పుష్ప మరి అమ్మాయిల పేరులా ఉంది అలాగే పేరు కూడా చాలా సాఫ్ట్ గా ఉంది అని చెప్పారట. ఇక పుష్ప అంటే ఫ్లవర్ అనే మీనింగ్ వస్తుందని కూడా చెప్పారు. ప్రతి ఒక్కరికి పుష్ప సినిమా విషయంలో పుష్ప అంటే ఫ్లవర్ అనే ఫీలింగ్ రాకుండా ఉండడం కోసం సుకుమార్ గారితో చర్చించగా సుకుమార్ పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్ అనే డైలాగ్ పెట్టారని ఈ సందర్భంగా అల్లు అర్జున్ వెల్లడించారు.

మొత్తానికి పుష్ప పేరు వల్ల ఒక పవర్ ఫుల్ డైలాగ్ వచ్చిందని ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఈ డైలాగ్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ బయటపెట్టారు. ఈ డైలాగుతో పాటు పుష్ప పుష్పరాజ్ తగ్గేదే అనే డైలాగ్ కూడా విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రాన్ని ఇంతకుమించి ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులను ప్రారంభం చేయనున్నారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus