Allu Arha: అర్హ తెలంగాణ యాస చూసి ఆశ్చర్యపోయిన అల్లు అర్జున్.. వీడియో వైరల్..!

  • November 21, 2022 / 02:06 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రొఫెషన్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో.. పర్సనల్ లైఫ్‌కి కూడా అంతే ప్రాముఖ్యతనిస్తాడు. షూటింగ్ నుండి బ్రేక్ దొరికితే చాలు.. ఇంటికే అంకితమైపోతాడు. పిల్లలు అర్హ, అయాన్‌లతో కలిసి తాను కూడా పిల్లాడిలా మారిపోయి ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాడు. అర్హకి సంబంధించిన క్యూట్ క్యూట్ పిక్స్, వీడియోస్ షేర్ చేస్తూ తన కూతురి మీద ప్రేమను వ్యక్తపరుస్తుంటాడు.ఈమధ్య అర్హ అడిగిందని నైట్ రైడ్‌కి తీసుకెళ్లి.. రోడ్ పక్కన బండి మీద వేడి వేడి దోశె తినిపించిన పిక్స్ వైరల్ అయ్యాయి.

ఇప్పుడు బన్నీ మరో లేటెస్ట్ వీడియో పోస్ట్ చేశాడు. నేడు (నవంబర్ 21) అర్హ పుట్టినరోజు. 2016 నవంబర్ 21న జన్మించిన అర్హ ఇప్పుడు ఆరవ ఏడాదిలోకి అడుగు పెడుతోంది. ఈ సందర్భంగా తన గారాల పట్టీ అర్హకి విషెస్ చెప్తూ బన్నీ ఓ క్యూట్ వీడియో షేర్ చేశాడు..‘హ్యాపీ బర్త్‌డే టు ది క్యూటెస్ట్ పర్సన్ ఇన్ మై లైఫ్’ అంటూ.. అర్హ చెప్తున్న కందీరీగ కథల తాలుకు వీడియో షేర్ చేశారు.. తన జుట్టులోకి కందిరీగలు వెళ్తున్నాయంటూ అర్హ ముద్దు ముద్దుగా చెప్తుంటే మురిసిపోతున్నాడు బన్నీ..

పొగబెట్టి తేనెపుట్ట తీసినారు అనడంతో.. తనను ఇమిటేట్ చేస్తూ.. ఫుల్ తెలంగాణ శ్లాంగ్ మాట్లాడుతుందంటూ బన్నీ తెగ హ్యాపీగా ఫీలయ్యాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఫ్యాన్స్, సెలబ్రిటీలు అర్హ భలే క్యూట్‌గా ఉంది అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రధారిగా రూపొందుతున్న హిస్టారికల్ ఫిలిం ‘శాకుంతలం’ ద్వారా చైైల్డ్ ఆర్టిస్టుగా ఇంట్రడ్యూస్ అవుతోంది అర్హ.

అంతేకాదు.. కేవలం 5 ఏళ్ల వయసులోనే 50 మంది చిన్నారులకు చదరంగంలో శిక్షణ ఇచ్చింది. అత్యంత పిన్నవయసులోనే అర్హలో ఉన్న అసమాన ప్రతిభను గుర్తించిన ప్రఖ్యాత నోబుల్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ సంస్థ అల్లు అర్హకు వరల్డ్‌ యంగెస్ట్‌ చెస్‌ ట్రైనర్‌గా అవార్డు అందించారు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus