ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుడు కావలెను ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఈవెంట్ లో బన్నీ మాట్లాడుతూ గీతా ఆర్ట్స్ తర్వాత చినబాబు గారి బ్యానర్ ను మాత్రమే తాను హోమ్ బ్యానర్ గా ఫీలయ్యానని చెప్పుకొచ్చారు. నాగవంశీ చాలా మంచి సినిమాలను నిర్మిస్తున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని బన్నీ చెప్పుకొచ్చారు. చినబాబు గారు ఎక్కువగా ప్రేమిస్తారని తక్కువగా మాట్లాడతారని బన్నీ అన్నారు.
చినబాబు గారు బడ్జెట్ విషయంలో తగ్గేదేలే అనే విధంగా ఉంటారని ఈ సినిమా రిలీజయ్యే రోజునే రొమాంటిక్ సినిమా కూడా రిలీజవుతోందని ఆ సినిమా బృందానికి కూడా తాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని బన్నీ పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీ గతంలో ఎప్పుడూ చూడని పరిస్థితిని చూసిందని సినిమా రంగానికి ఈ సీజన్ ఎంతో ఇంపార్టెంట్ అని బన్నీ వెల్లడించారు. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా థియేటర్లకు జనాలు రావడం పెరుగుతోందని బన్నీ అన్నారు.
హిందీలో కూడా భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కుతున్నాయని బన్నీ వెల్లడించారు. పుష్ప ప్రేక్షకులకు నచ్చాలని కోరుకుంటున్నానని ఈ సినిమాలో పాటలు బాగా వచ్చాయని బన్నీ పేర్కొన్నారు. సినిమా గురించి కాన్ఫిడెంట్ గా అదీఇదీ చెప్పలేనని బన్నీ వెల్లడించారు. అయితే పుష్ప గురించి ఏమీ చెప్పనని బన్నీ చేసిన కామెంట్లు వైరల్ అవుతుండగా బన్నీ సినిమాపై ఇప్పటినుంచే భారీగా అంచనాలను పెంచడం ఇష్టం లేక అలా చెప్పాడని బన్నీ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.