టాలీవుడ్ ఇండస్ట్రీలో సంవత్సరం సంవత్సరానికి సినిమా బడ్జెట్లు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. పాజిటివ్ టాక్ వస్తే తప్ప సినిమాలు బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితులు ఇండస్ట్రీలో కనిపించడం లేదు. నిన్న విడుదలైన పుష్ప పార్ట్1 సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. నిర్మాతలు 180 కోట్ల రూపాయల బడ్జెట్ తో పుష్ప మూవీ తెరకెక్కిందని చెబుతున్నా సిల్వర్ స్క్రీన్ పై ఆ స్థాయి క్వాలిటీ అయితే కనిపించలేదనే చెప్పాలి. టెక్నికల్ గా పుష్ప సినిమా వీక్ గా ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
పోస్ట్ ప్రొడక్షన్ పనులు హడావిడిగా చేయడంతో పుష్ప సినిమా ఫలితంపై ఆ ప్రభావం పడిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పుష్ప ది రైజ్ కు ఇద్దరు ఎడిటర్లు పని చేసినా సినిమాలో ల్యాగ్ ఎక్కువైందని ఎడిటింగ్ సరిగ్గా లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. పుష్ప పార్ట్1 చూసిన ప్రేక్షకులు పార్ట్ 2పై ఆసక్తి చూపే అవకాశాలు తక్కువేనని చెప్పవచ్చు. పుష్ప సినిమాలో పార్టీ లేదా పుష్పా అనే డైలాగ్ నెట్టింట వైరల్ కాగా ప్రస్తుతం నెటిజన్లు పార్ట్2 లేదా పుష్పా అంటూ వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు.
పోస్ట్ ప్రొడక్షన్ కు సమయం సరిపోకుండా ఉండి ఉంటే సినిమాను వాయిదా వేసి ఉంటే బాగుండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పుష్ప పార్ట్2కు సంబంధించిన చాలా సన్నివేశాల షూటింగ్ ఇప్పటికే పూర్తి కావడం గమనార్హం.
Most Recommended Video
‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!