Allu Arjun: లైకాతో అల్లు అర్జున్.. డైరెక్టర్ ఫిక్స్ అయినట్లేనా?

అల్లు అర్జున్ మొత్తానికి పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఆ తరువాత చేయబోయే సినిమాలు అంతకు మించి ఉండాలని బన్నీ కథలను వింటున్నాడు. ఇప్పటికే పుష్ప 2 కోసం మరింత పవర్ఫుల్ గా సిద్ధమవ్వాలని ఫిక్స్ అయ్యాడు. సుకుమార్ కూడా కథలో మరింత బలాన్ని పెంచే విధంగా కొన్ని మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరొక పవర్ఫుల్ విలన్ కూడా ఈసారి కథలోకి రానున్నట్లు సమాచారం.ఇక సినిమాకు సంబంధించిన మిగిలిన షూటింగ్ కూడా త్వరలోనే మొదలు కానుంది.

అయితే ఇటీవల అల్లు అర్జున్ లైకా ప్రొడక్షన్ లో ఒక సినిమా చేసేందుకు ఒప్పందం కుదర్చుకున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో ఉండే విధంగా లైకా సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. ఇక దర్శకుడు ఎవరు అనే విషయంలో గత కొన్ని రోజులుగా అనేక రకాల రూమర్స్ వస్తుండగా ఫైనల్ గా అట్లీని ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కోలీవుడ్ లో విజయ్ తో వరుస ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న అట్లీ గతకొంత కాలంగా తెలుగు హీరోలపై కూడా ఫోకస్ ఎక్కువగానే పెట్టాడు.

ఇక బాలీవుడ్ లో షారుక్ ఖాన్ తో కూడా ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా తరువాత బన్నీతో వర్క్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అసలైతే అట్లీ జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ ఇద్దరికి సరైన స్లాట్ దొరకకపోవడంతో కాంబినేషన్ సెట్టవ్వడం లేదు. ఇక బన్నీ ఐకాన్, పుష్ప 2 తర్వాత బోయపాటితో కూడా మల్టీస్టారర్ చేసే ఛాన్స్ ఉంది.

ఇక వీటి అనంతరం అట్లీతో ప్రాజెక్ట్ సెట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక లైకా ప్రొడక్షన్ పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించాలని ఆలోచిస్తుంది. మరి సినిమా ఎప్పుడు తెరపైకి వస్తుందో చూడాలి.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus