Allu Arjun: బాలీవుడ్ స్టార్ దర్శకుడితో బన్నీ మీటింగ్?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయాలని ప్రస్తుతం బాలీవుడ్ ప్రముఖ దర్శకులు కూడా ఎంతో ఆసక్తిగా అతనిని సంప్రదించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. పుష్ప సినిమాతో ఒక్కసారిగా బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన బన్నీ త్వరలోనే డైరెక్ట్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సినిమా చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణం కనిపిస్తోంది. ఇంతకుముందు చేయాలనుకున్న చిన్నతరహా ప్రాజెక్టులను కూడా పక్కన పెట్టేసి ప్రస్తుతం సీనియర్ దర్శకులతో బడా ప్రాజెక్టులను లైన్ లో పెట్టాలి అని చూస్తున్నాడు.

Click Here To Watch Now

ఈ క్రమంలో కొంత మంది బాలీవుడ్ దర్శకులు అల్లుఅర్జున్ తో ప్రత్యేకంగా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇదివరకే అల్లు అర్జున్ కు బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఒక రెండు ఆఫర్లు వచ్చాయట. ప్రముఖ నిర్మాణ సంస్థలు పేరున్న దర్శకులు కూడా బన్నీని కలిసే ప్రయత్నం చేశారు. అయితే బాలీవుడ్ ఎంట్రీకి పవర్ఫుల్ స్టోరీ ఉండాలి అని బన్నీ రెగ్యులర్ కమర్షియల్ కథలు రావడంతో వాటిని రిజెక్ట్ చేశారట.

ఇక రీసెంట్ గా అల్లు అర్జున్ ముంబై కి వెళ్లి అక్కడ సంజయ్ లీలా భన్సాలీని ప్రత్యేకంగా కలుసుకున్నట్లు తెలుస్తుంది. సంజయ్ ఆఫీసులో దాదాపు గంటల తరబడి అల్లు అర్జున్ మాట్లాడినట్లు సమాచారం. సాధారణంగా అల్లు అర్జున్ కి ఒక కథ నచ్చితే ఎలాగైనా దాన్ని తెరపైకి తీసుకురావాలని కష్టపడుతూ ఉంటాడు. దర్శకులకు కూడా తనవంతు సహాయంగా సలహాలు కూడా ఇస్తూ ఉంటాడు. అందుకే చాలా మంది దర్శకులు బన్నీతో సినిమా చేయాలి అనుకుంటారు.

ఇక సంజయ్ భన్సాలీ కూడా ఎప్పటినుంచో అల్లు అర్జున్ కోసం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ ప్రాజెక్ట్ సెట్ అయితే మాత్రం ఆయన తన సొంత ప్రొడక్షన్ లోనే సినిమా చేయాలని ఆలోచిస్తున్నారట. ఇక అల్లు అర్జున్ అయితే పుష్ప 2 ఐకాన్ సినిమాలతో పాటు కొరటాల శివతో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది. మరి సంజయ్ లీలా బన్సాలీ తో సినిమా ఎప్పుడు చేస్తాడో చూడాలి.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video


ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus