Allu Arjun: ఆ విషయంలో అల్లు అర్జున్ జాగ్రత్త పడకపోతే కష్టమేనా..!

  • October 3, 2023 / 05:42 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని పాన్ ఇండియన్ స్టార్ గా నిలబెట్టిన చిత్రం ‘పుష్ప’. 2021 వ సంవత్సరం లో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని బద్దలు కొట్టి అల్లు అర్జున్ ని తిరుగులేని పాన్ ఇండియన్ సూపర్ స్టార్ గా నిలబెట్టింది. ఈ చిత్రం తెలుగు వెర్షన్ కంటే, హిందీ వెర్షన్ లోనే ఎక్కువ వసూళ్లను రాబట్టింది. హిందీ లో కేవలం రెండు కోట్ల రూపాయిల నెట్ వసూళ్లతో ప్రారంభమైన ఈ సినిమా, ఫుల్ రన్ లో ఏకంగా 140 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది.

అంతే కాదు నార్త్ ఇండియా లో అల్లు అర్జున్ కి కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చి పెట్టింది ఈ చిత్రం. ఇప్పుడు అందరూ పుష్ప 2 కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. వచ్చే ఏడాది ఆగష్టు 15 వ తారీఖున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప ఇమేజి నుండి ఎలా బయటకి వస్తాడు అనేది పెద్ద ప్రశ్న అయిపోయింది.

పుష్ప చిత్రం అల్లు అర్జున్ (Allu Arjun) కి ఎంత ప్లస్ అయ్యిందో, భవిష్యత్తులో అంతే మైనస్ కాబోతుంది. ఎందుకంటే ఈ ఇక నుండి అల్లు అర్జున్ ఏ క్యారక్టర్ చేసినా, ఏ సినిమా చేసినా పుష్ప తో పోల్చి చూసుకుంటారు. అంచనాలు పుష్ప రేంజ్ ని అందుకోలేకపోతే ఫ్లాప్ అవుతాయి. ఇలా మహేష్ బాబు పోకిరి ఇమేజి నుండి బయట పడడానికి 5 ఏళ్ళు పట్టింది.

ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే ఇబ్బంది ని ఎదురుకోబోతున్నాడా?, లేకపోతే తొందరగానే ఈ పుష్ప ఇమేజి నుండి బయటపడబోతున్నాడా అనేది చూడాలి. పుష్ప 2 అయిపోగానే అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ తో మరో సినిమా చెయ్యబోతున్నాడు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus