Allu Arjun: ప్రభాస్ కంటే హయ్యెస్ట్ ర్యాంక్.. ఎలాగంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఇప్పుడు గ్లోబల్ లెవల్లో మోగుతోంది. అభిమానులు ఇంకా అట్లీ సినిమా అప్డేట్ కోసం ఎదురుచూస్తుండగానే, బన్నీ వారికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. 2025లో గూగుల్ లో అత్యధికంగా వెతికిన టాలీవుడ్ హీరోల లిస్టులో బన్నీ నెంబర్ వన్ స్థానాన్ని కొట్టేశారు. పుష్ప 2 సృష్టించిన సునామీ తర్వాత ఆయన రేంజ్ ఎలా మారిందో చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రభాస్, మహేష్ బాబు లాంటి పాన్ ఇండియా స్టార్స్ ను వెనక్కి నెట్టి మరీ బన్నీ టాప్ చైర్ లో కూర్చోవడం విశేషం.

Allu Arjun

ఈ లిస్టులో ప్రభాస్ రెండో స్థానంలో నిలిస్తే, మహేష్ బాబు మూడు, పవన్ కళ్యాణ్ నాలుగు, ఎన్టీఆర్ ఐదో స్థానంలో ఉన్నారు. డిసెంబర్ 24 నాటికి ఉన్న వరల్డ్ వైడ్ సెర్చ్ ట్రెండ్స్ ప్రకారం ఈ ర్యాంకులు ఫిక్స్ అయ్యాయి. అయితే ఈ రికార్డులే కాకుండా, బన్నీ ఫ్యాన్స్ కు మరో కిక్ ఇచ్చే వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోయే నాలుగో సినిమా. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ హిట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

మధ్యలో ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ తో ఉంటుందని నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చినా, ఇప్పుడు సీన్ మళ్ళీ రివర్స్ అయినట్లు తెలుస్తోంది. ఆ కథ మళ్ళీ తిరిగి బన్నీ చేతికే వచ్చిందట. పురాణాలకు, భవిష్యత్తుకు లింక్ పెడుతూ సాగే ఒక భారీ మైథలాజికల్ కథతో ఈ సినిమా ఉండబోతోందని టాక్. ఒకవైపు గూగుల్ రికార్డులు, మరోవైపు అట్లీ, త్రివిక్రమ్ లాంటి సాలిడ్ లైనప్ చూస్తుంటే రాబోయే రోజుల్లో బన్నీ డామినేషన్ పీక్స్ లో ఉంటుందని స్పష్టంగా అర్థమవుతోంది.\

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus