Allu Arjun: మేడమ్‌ టుస్సాడ్స్‌ లో అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఏర్పాటు!

టాలీవుడ్ స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. ఇలా ఈ సినిమాతో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయనకు ఈ సినిమాలోని నటనకు గాను ఏకంగా ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఇలా పుష్ప సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అల్లు అర్జున్ ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

ఇక ఈ సినిమా ద్వారా ఈయన అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు సంపాదించుకున్నారని తెలుస్తుంది. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు అందుకున్నటువంటి గౌరవాన్ని తాజాగా బన్నీ అందుకున్నారు. ఇప్పటికే ప్రభాస్ మహేష్ బాబు మైనపు ఆయనకు విగ్రహాలను ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం విశేషం.

లండన్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారట. అక్కడ తమ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని ప్రతి ఒక్కరు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. ఇప్పటికే మహేష్ బాబు ప్రభాస్ వంటి స్టార్ హీరోల విగ్రహాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక త్వరలోనే ఆయన కొలతలను ఇవ్వడానికి కూడా లండన్ వెళ్లబోతున్నారని సమాచారం.

ఈ విధంగా అల్లు అర్జున్ (Allu Arjun) నటనపరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా తాజాగా ఇలాంటి ఒక గౌరవాన్ని కూడా అందుకోవడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఈయన తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus