Allu Ayaan: అయాన్.. నా గొడ్డలి ఎందుకు తీసుకెళ్లావ్ రా అంటూ అల్లు అర్జున్ ఫన్నీ ఇన్స్టా స్టోరీ!

నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ లో అల్లు అయాన్ కి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంటుంది. అయాన్ చేసే అల్లరి చేష్టలను తెగ ఎంజాయ్ చేస్తారు జనాలు. అల్లు స్నేహా రెడ్డి ప్రొఫైల్ ను జనాలు ఫాలో అవ్వడానికి ఒన్నాఫ్ ది రీజన్ ఆమె పోస్ట్ చేసే అయాన్ & అర్హల ఫోటోలు, వీడియోలు అని చెప్పొచ్చు. అయితే.. ఇటీవల స్కూల్లో జరిగిన “హలోవీన్” సెలబ్రేషన్స్ కోసం రెడీ అయిన అయాన్ (Allu Ayaan) & అర్హల ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలా పోస్ట్ చేసింది అల్లు స్నేహా రెడ్డి.

Allu Ayaan

ఆ స్టోరీని రీపోస్ట్ చేసిన అల్లు అర్జున్ (Allu Arjun) “రేయ్ అయాన్ షూటింగ్ నుండి నా గొడ్డలి ఎందుకు తీసుకెళ్లావ్ రా” అని రీ షేర్ చేశాడు. దాంతో.. సోషల్ మీడియా మొత్తం ఈ ఫోటో వైరల్ అయ్యింది. నిజానికి అది పుష్ప (Pushpa) సినిమాలో బన్నీ వాడిన గొడ్డలి కాకపోయినా, బన్నీ పెట్టిన పోస్ట్ తో ఆ ఫోటో వైరల్ అయ్యింది. ఇకపోతే.. డిసెంబర్ 5న “పుష్ప2”ను (Pushpa 2) విడుదలకు నిర్మాతలు సిద్ధమవుతుండగా, ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఓ పాపులర్ హీరోయిన్ ను ఫైనల్ చేసేందుకు సుకుమార్ సతమతమవుతున్నాడు.

దాదాపుగా 1000 కోట్ల రూపాయల ప్రీరిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమాకి లాంగ్ వీకెండ్ అనేది చాలా ప్లస్ అవుతున్నప్పటికీ.. సినిమాకి బ్రేక్ ఈవెన్ రాబట్టాలంటేనే “బాహుబలి 2” (Baahubali 2) కలెక్షన్స్ క్రాస్ చేయాలి అనే ఆలోచనే కాస్త భయపెడుతుంది. కానీ, నార్త్ లో “పుష్ప 2″కి ఉన్న క్రేజ్ ను కన్సిడర్ చేస్తే, ఇక్కడ ఓ మోస్తరు కలెక్షన్స్ సాధించినా కూడా, హిందీ బెల్ట్ లో మాత్రం రచ్చ చేయడం ఖాయం అంటూ భారీ అంచనాలు నమోదవుతున్నాయి.

దేవుడిగా మహేష్ బాబు.. ఇది విన్నారా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus