Mahesh Babu: దేవుడిగా మహేష్ బాబు.. ఇది విన్నారా!

సూపర్ స్టార్ కృష్ణ (Krishna) మనవడు, మహేష్ బాబు (Mahesh Babu) మేనల్లుడు అశోక్ గల్లా (Ahok Galla) , తెలుగు సినీ ప్రపంచంలో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. తొలి సినిమా ‘హీరో’తో డీసెంట్ హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం తన కొత్త సినిమా ‘దేవకీ నందన వాసుదేవ’  (Devaki Nandana Vasudeva)  తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అశోక్ గల్లా సరసన తెలుగు అమ్మాయి మానస వారణాసి (Manasa Varanasi) హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల  (Arun Jandyala)  దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం, డివైన్ ఎలిమెంట్స్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోంది.

Mahesh Babu

ఈ సినిమాను లలితాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎన్ఆర్ఐ నిర్మాత సోమినేని బాలకృష్ణ (Somineni Balakrishna) నిర్మిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ బాబు ఈ సినిమాలో కృష్ణుడిగా గెస్ట్ రోల్ చేయనున్నారనే టాక్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కృష్ణ గారు చేసిన పలు చిత్రాల్లో భగవంతుడి పాత్రలను స్ఫూర్తిగా తీసుకొని, ఆధ్యాత్మిక అంశాలు కలిగిన ఈ సినిమాలో కనిపించనున్నారని ప్రచారం సాగుతోంది.

దీపావళి కానుకగా మహేష్ ఈ గెటప్‌లోని పోస్టర్ రిలీజ్ చేస్తారంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు కృష్ణుడి గెటప్‌లో ఉంటే ఎలా ఉంటారో అన్న ఉత్సాహంతో అభిమానులు ఇప్పటికే ఎఐ ద్వారా సృష్టించిన ఇమేజెస్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మహేష్ గెటప్‌లో అదిరిపోతారని, ఆయన దేవుడి పాత్రలో మరింత పవర్ ఫుల్‌గా కనిపిస్తారని అంటున్నారు. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియకపోయినా, దీన్ని విన్న ఫ్యాన్స్ మాత్రం మహేష్ క్యామియో కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

సాధారణంగా మహేష్ బాబు తన కుటుంబానికి సంబంధించిన చిత్రాలకు సోషల్ మీడియా ద్వారా మద్దతు తెలుపుతుంటారు. కానీ ఈసారి తన మేనల్లుడి సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తే, అది అశోక్ గల్లా కెరీర్‌కు పెద్ద బూస్ట్ అవుతుందనడంలో సందేహం లేదు. మహేష్ కృష్ణుడిగా కనిపిస్తే, అభిమానులకు ఒక ప్రత్యేక అనుభూతిని ఇవ్వవచ్చు.

అల్లు అరవింద్ అలా ఆలోచిస్తే తండేల్ సంక్రాంతి రేసులో నిలబడదు: చందు మొండేటి!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus