ఒకవైపు చిరంజీవి చిన్నకూతురు పెళ్లి పనులు జరుగుతున్న సమయంలోనే,త్వరలో నా పెళ్లి కూడా జరగబోతుందంటూ,సంకేతాలు ఇస్తున్నాడు మెగా హీరో అల్లు శిరీష్. తాజాగా అల్లు శిరీష్ ట్విట్టర్ ద్వారా ‘త్వరలోనే నాకు శ్రీమస్తు శుభమస్తు.. మీ అందరి ఆశీస్సులు నాకు తప్పకుండా కావాలి.. మిగతా వివరాలు అతి త్వరలో చెప్తానంటూ ట్వీట్ చేసాడు. దీన్ని బట్టి చూస్తే అల్లు వారి అబ్బాయి కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని అర్ధమవుతుంది. మార్చిలో చిరు కూతురు శ్రీజ పెళ్లి తర్వాత అల్లు వారి ఇంట కూడా పెళ్లి భాజాలు మోగనున్నట్లు తెలుస్తుంది.