Allu Sirish: అల్లు శిరీష్ సిక్స్ ప్యాక్ ఫొటో వైరల్..!

  • May 21, 2021 / 12:13 PM IST

హీరో అల్లు శిరీష్ తన సిక్స్ ప్యాక్ బాడీని చూపిస్తూ తీసుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన అన్న అల్లు అర్జున్ లానే శిరీష్ కూడా ఫిట్‌నెస్‌ పై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటాడు అన్న సంగతి తెలిసిందే. ఇటీవల శిరీష్ మరింతగా బరువు తగ్గి, స్లిమ్ గా , ఫిట్ గా కనిపిస్తున్నాడు. జిమ్ లో వర్కౌట్స్ ముగించిన అనంతరం అతను ఈ సెల్ఫీ తీసుకున్నట్టు స్పష్టమవుతుంది. ఏమైనా ఈ ఫోటో మాత్రం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది అనే చెప్పాలి.

ఇక సినిమాల విషయానికి వస్తే.. అల్లు శిరీష్ ప్రస్తుతం ఓ రొమాంటిక్-కామెడీ ఎంటర్టైనర్ లో నటించడానికి రెడీ అయినట్టు సమాచారం. ఈ చిత్రం వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఇటీవల శిరీష్ ‘విలాయతీ షరాబ్ ‘ అనే హిందీ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ తో బాలీవుడ్ ను మొత్తం ఓ ఊపు ఊపేసాడు. ఇది యూట్యూబ్లో 100 మిలియన్లకు పైనే వ్యూస్ ను నమోదు చేసి రికార్డులు సృష్టించింది.

అంతేకాకుండా లాంగ్ టైం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలిచిన ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ గా కూడా రికార్డ్ సృష్టించింది. ఇక 2019లో ‘ఏబీసీడీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు శిరీష్… దాని తరువాత మరో సినిమాలో అతను నటించలేదు. లాంగ్ గ్యాప్ తీసుకుని ఇప్పుడు మళ్ళీ ప్రేక్షకులను అలరించడానికి ముందుకు వచ్చాడు.


Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus