బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘అల్లుడు అదుర్స్’. నభా నటేష్,అనూ ఇమాన్యుయల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సోనూ సూద్ కూడా కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్ మోనాల్ కూడా ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 15న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ‘రాక్షసుడు’ చిత్రంతో హిట్టు కొట్టి మంచి ఫామ్లోకి వచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఈ చిత్రంతో కూడా మరో హిట్టు కొట్టడం ఖాయమని చిత్ర యూనిట్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వారి నమ్మకం ఎంత బలమైనదో సినిమా విడుదలయ్యాక తెలుస్తుంది కానీ..
‘అల్లుడు అదుర్స్’ కు మాత్రం థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగిందని చెప్పొచ్చు. ఆ వివరాలను ఒకసారి పరిశీలిస్తే :
నైజాం | 4.3 cr |
ఆంధ్ర | 4.7 cr |
సీడెడ్ | 3.2 cr |
ఏపీ +తెలంగాణ | 12.2 cr |
‘అల్లుడు అదుర్స్’ చిత్రానికి 12.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యి క్లీన్ హిట్ గా నిలబడాలి అంటే.. 13కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలకు మాస్ లో మంచి క్రేజ్ ఉంది. కాబట్టి ఇది పెద్ద కష్టమైన టార్గెట్ ఏమీ కాదు. అయితే సంక్రాంతికి ఒక రెండు లేదా మూడు రోజుల ముందు విడుదలైతే.. ఈ ‘అల్లుడి’కి సంక్రాంతి మరింతగా కలిసొచ్చే అవకాశం ఉండేది.
Most Recommended Video
2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!