సావిత్రిగా విద్యాబాలన్ కాదట!

  • August 11, 2016 / 12:29 PM IST

గత కొంతకాలంగా మహానటి సావిత్రి జీవితానికి సంబంధించిన కథను చిత్రంగా రూపొందించాలని దర్శకుడు నాగాశ్విన్ ప్రయత్నిస్తున్నాడు. ఎవడే సుబ్రమణ్యం చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న నాగాశ్విన్ తన తదుపరి చిత్రంగా చేసేది సావిత్రి సినిమానే అని తెలియజేశాడు. అయితే సావిత్రి పాత్రలో ఎవరు నటిస్తారనే విషయం ఆసక్తిగా మారింది.

నటి విద్యాబాలన్ ను ఈ పాత్ర కోసం ఎన్నుకున్నారని, ఆమె అడిగినట్లుగా 4 కోట్ల పారితోషికం కూడా ఇవ్వనున్నారని రకరకాల వార్తలు వినిపించాయి. అయితే ఈ మాటల్లో నిజం లేదని దర్శకుడు నాగాశ్విన్ తేల్చేశాడు. అసలు సావిత్రి పాత్ర కోసం విద్యాబాలన్ ను సంప్రదించలేదని వెల్లడించాడు. అంతేకాదు స్క్రిప్ట్ పూర్తయ్యే వరకు నటీనటులను కన్ఫర్మ్ చేయలేనని చెప్పాడు. ముందుగా అనౌన్స్ చేసినట్లు సావిత్రి పాత్రధారిణి విషయంలో ప్రేక్షకులదే పై చేయి అని స్పష్టం చేశారు. ఇకనైనా ఈ గాసిప్స్ కు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus