Nagarjuna: గోల్డెన్ ఛాన్స్ ను మిస్ చేసుకున్న అమలా పాల్, మెహ్రీన్.. కారణం అదే..!

Advertisement

అక్కినేని నాగార్జున హీరోగా ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో ‘శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి’, ‘నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్’ బ్యానర్ల పై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ లు కలిసి ‘ఘోస్ట్’ అనే ఓ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాన్ని రూపొందిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ స్టైలిష్ యాక్ష‌న్ ఫిలింలో హీరోయిన్‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్ ను మొదట ఎంపిక చేసుకున్నారు. దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు.

ఇందులో భారీ యాక్షన్ సన్నివేశాల్లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ పాల్గొనాల్సి ఉంది.అయితే ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ కావడంతో ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకుంది. దీంతో మేకర్స్ అమలా పాల్ ను సంప్రదించారు. అయితే ఆమె పెద్ద మొత్తంలో పారితోషికం డిమాండ్ మేకర్స్ ఆమెను పక్కన పెట్టారు. టాలీవుడ్లో ఆమె రీ ఎంట్రీకి ఈ ప్రాజెక్టు మంచి ఛాయిసే కానీ ఎందుకో ఆమె తప్పుకుంది.అమలా పాల్ తో పాటు మెహ్రీన్ ను కూడా సంప్రదించారు దర్శకనిర్మాతలు.

ఆమె కూడా రూ.1 కోటి పై అడుగుతుందని ఆమెని కూడా లైట్ తీసుకున్నారట.ప్రస్తుతానికైతే మేకర్స్ ఏ హీరోయిన్‌ ను ఫైనల్ చేయలేదు.కాకపోతే అమలా పాల్, మెహ్రీన్ లకు ‘ఘోస్ట్’ మంచి ఛాయిసే. ఇందులో హీరోయిన్ పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus