‘ఆమె’ చిత్రం ఆగిపోవడానికి అసలు కారణం?

తమిళ చిత్రసీమలో వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రెస్ అంటే.. అమలా పాల్ పేరే గుర్తొస్తుంది. సినిమాలు చేసినా చేయకపోయినా… నిత్యం ఏదో ఒక వివాదాలతో వార్తల్లో నిలుస్తుంటుంది ఈ భామ. ఇదిలా ఉండగా.. ఈమె నటించిన తాజా చిత్రం ‘ఆమె’. జూలై 19(ఈరోజు) న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఆగిపోయినట్టు తెలుస్తుంది. దానికి అసలు కారణం ఈ చిత్రం పై కేసు నమోదవ్వడమనేనని సమాచారం. విషయం ఏమిటంటే.. అమల నగ్నంగా ఉంటూ టేప్ చుట్టుకుని ఉన్న ఫోటోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇదే లుక్ తో పోస్టర్లు కూడా వచ్చాయి.

దీంతో ప్రియా రాజేశ్వరి అనే రాజకీయ నాయకురాలు.. అమలా పాల్ పై కేసు పెట్టింది. ‘అమలా పాల్ వల్ల తమిళ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు హిందూ ధర్మానికి విఘాతం కలుగుతుంది. కేవలం డబ్బుల కోసమే అమల ఇలా చేస్తుంది. ఆమె పబ్లిసిటీ కోసమే ఇలా నగ్నంగా నటించింది. యువతను కూడా పక్క దారి పట్టించేలా ‘ఆమె’ చిత్రంలో సీన్లు ఉన్నాయి. ఇలాంటి సినిమాల వల్లే అత్యాచారాలు ఎక్కువైపోతున్నయి. వెంటనే ఈ చిత్రంలో అమలాపాల్ నగ్నంగా ఉండే సీన్లని తొలగించాలి. ఆమె నగ్నంగా ఉన్న పోస్టర్లను పబ్లిసిటీకి ఉపయోగించవద్దని ఇదివరకే పోలీసులు నిర్మాతలకి అలాగే డిస్ట్రిబ్యూటర్లకి ఆదేశించారు. అయినప్పటికీ ఇలా నగ్నంగా ఉన్న పోస్టర్లతో ప్రమోషన్స్ చేసినందుకు.. అమలా పాల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని’ కంప్లైంట్లో పేర్కొంది ప్రియా రాజేశ్వరి. ఈ కారణంగానే ఈరోజు విడుదల కావాల్సిన ఈ చిత్రం విడుదల కాలేదు. మార్నింగ్ షో లను క్యాన్సిల్ చేశారు. సాయంత్రానికి ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి వారి మాటల్లో ఎంతవరకూ నిజముందో తెలియాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus