అమెజాన్ ప్రైమ్ లో విశేషాధారణ దక్కించుకుంటున్న ‘ముగ్గురు మొనగాళ్ళు’

శ్రీ‌నివాస్‌రెడ్డి, దీక్షిత్‌ శెట్టి (కన్నడ హిట్‌ మూవీ ‘దియా’ ఫేమ్‌), వెన్నెల రామారావు ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కిన చిత్రం ‘ముగ్గురు మొనగాళ్లు’. ఫస్ట్ లుక్, ట్రైల‌ర్‌ లతోనే మంచి బజ్ ను క్రియేట్ చేసిన ఈ చిత్రం ఇటీవల అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో  విడుద‌ల‌ అయ్యి ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంది.అంగవైకల్యం కలిగిన ముగ్గురు యువకులు  ఓ మర్డర్ కేసులో ఇరుక్కుని ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు.. ఆ కేసు నుండీ ఎలా బయటపడ్డారు? అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. శ్రీనివాసరెడ్డికి విన‌ప‌డ‌దు, దీక్షిత్‌ శెట్టి మాట్లాడలేడు, వెన్నెల రామారావుకు కనపడదు. ఈ ముగ్గురు నటులు కూడా తమ తమ పాత్రలకు జీవం పోశారనే చెప్పాలి. వీరి నటనతో ఆధ్యంతం ప్రేక్షకులను క‌డుపు చ‌క్క‌లయ్యేలా న‌వ్వించారు.

ఈ చిత్రంలో ఎన్నో థ్రిల్లింగ్‌ అంశాలు కూడా ఉన్నాయి. ‘గ‌రుడ‌ వేగ’ ఫేమ్ అంజి అందించిన  విజువ‌ల్స్‌, సురేష్  బొబ్బిలి సంగీతం, చిన్న  నేపేథ్య సంగీతం వంటివి ఈ చిత్రానికి అదనపు ఆకర్షణలుగా నిలిచాయని చెప్పొచ్చు. ఈ చిత్రానికి అమెజాన్ ప్రైమ్లో మంచి ఆదరణ దక్కుతుంది.అలాగే మంచి వ్యూయర్ షిప్ కూడా నమోదవుతుండడం హర్షించదగ్గ విషయం. ప్రస్తుతం ‘ముగ్గురు మొనగాళ్ళు’ చిత్రం అమెజాన్ ప్రైమ్లో ట్రెండింగ్లో దూసుకుపోతుండడం మరో విశేషంగా చెప్పుకోవాలి.. అభిలాష్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్న ‘చిత్రమందిర్‌ స్టూడియోస్‌’ బ్యానర్ పై  అచ్యుత్‌ రామారావు నిర్మించారు.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus