సుహాస్ హీరోగా ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో అంటే ఫిబ్రవరి 2 న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన పాటలు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. అలాగే టీజర్, ట్రైలర్స్ .. కూడా మంచి మార్కులు కొట్టేశాయి అని చెప్పాలి. దీంతో ఈ సినిమా పై అంచనాలు ఏర్పడ్డాయి.
‘జి ఎ 2 పిక్చర్స్’ ‘ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్’ ‘మహాయాన మోషన్ పిక్చర్స్’ సంస్థల పై ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండగా ‘బన్నీ వాస్’ ‘వెంకటేష్ మహా’ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. దుష్యంత్ కటికనేని ఈ చిత్రానికి దర్శకుడు. ఇదిలా ఉండగా.. ఆల్రెడీ ఈ చిత్రాన్ని ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దలకి చూపించడం జరిగింది. సినిమా చూశాక వాళ్ళు తమ అభిప్రాయాన్ని వెల్లడించడం కూడా జరిగింది.
వారి టాక్ ప్రకారం.. కవలలు అయినటువంటి అక్కాతమ్ముడి(సుహాస్, శరణ్య) జీవితంలో చోటు చేసుకున్న కొన్ని ఊహించని పరిణామాలే ఈ చిత్రం కథాంశం అని తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్ చాలా ఫన్నీగా ఉంటుందట. హీరో అలాగే అతని ఫ్రెండ్స్ చేసే కామెడీతో సరదా సరదాగా సాగిపోతుందట. అయితే సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా సాగుతుందట. హీరో సుహాస్ తో పాటు సిస్టర్ రోల్ చేసిన శరణ్య పాత్ర కూడా గుర్తుండిపోతుంది అని అంతా అంటున్నారు.
ఆమె పోలీస్ స్టేషన్ సీన్లో ఫైట్ చేస్తుందట. మాస్ ఆడియన్స్ కి అది బాగా కనెక్ట్ అవుతుంది అని అంటున్నారు. సెకండ్ హాఫ్ సీరియస్ గా సాగినా.. ఎండింగ్ బాగుందని, అందరూ బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుందని వాళ్ళు చెబుతున్నారు. ఫిబ్రవరి 1 న నైట్ ప్రీమియర్స్ కూడా పడుతున్నాయి. మరి ఆ షోలతో ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం.. సినిమా (Ambajipeta Marriage Band) బాగానే ఉంది అని అంటున్నారు.