“బాహుబలి” సినిమా తర్వాత మన రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ క్రేజ్ కారణంగానే కరణ్ జోహార్ తన కాఫీ విత్ కరణ్ సెకండ్ సీజన్ కి చీఫ్ గెస్ట్ గా బాహుబలి టీం అయిన ప్రభాస్, రాజమౌళి మరియు రాణాని పిలిచాడు. అదే సందర్భంలో ముంబైలో ఘనంగా జరిగిన ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ వివాహానికి కూడా ప్రభాస్ ను ప్రత్యేకంగా ఆహ్వానించాడట. నిజానికి ఈ తరహా ఈవెంట్స్ కు అటెండ్ అవ్వడానికి మన స్టార్ హీరోలు కాస్త గట్టిగా డబ్బు గుంజుతుంటారు.
దాంతో.. ప్రభాస్ కూడా అదే తరహాలో అంబానీ దగ్గర డబ్బు తీసుకొని వెళ్లాడని సోషల్ మీడియా కొందరు కామెంట్స్ చేయడం మొదలెట్టారు. అయితే.. ప్రభాస్ ఫ్యాన్స్ వెంటనే వాటిని ఖండించారు. మా ప్రభాస్ అలా డబ్బులు తీసుకొనే మనిషి కాదని తేల్చి చెప్పడమే కాదు.. అంబానీ లాంటి ఓ సంపన్న కుటుంబం మన తెలుగు హీరో అయిన ప్రభాస్ ను ప్రత్యేకంగా ఆహ్వానించడమే కాక అక్కడ వారి కుటుంబ సభ్యులందరూ ప్రభాస్ తో ఫోటోల గురించి క్యూలో నిలబడితే.. ఇలాంటి చీప్ కామెంట్స్ చేయడం మంచిది కాదని చెప్పుకొచ్చారు.