Amigos Trailer: కళ్యాణ్ రామ్‌కు ‘అమిగోస్’ మరో ‘జై లవ కుశ’ అవుతుందా!

  • February 3, 2023 / 06:43 PM IST

నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ మూవీ థియేట్రికల్ ట్రైలర్ వచ్చేసింది. కర్నూలులోని శ్రీరామ థియేటర్లో మూవీ టీం, ఫ్యాన్స్, ప్రేక్షకుల మధ్య ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. కళ్యాణ్ రామ్‌ని చూసేందుకు ఎయిర్ పోర్ట్ వద్దకు భారీగా అభిమానులు రావడంతో దాదాపు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ‘అమిగోస్’ సినిమాతో రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతుండగా.. ఆషిక రంగనాథ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.

కళ్యాణ్ రామ్ మూడు డిఫరెంట్ క్యారెక్టర్లలో కనిపించనున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌లో.. ఒకరికొకరు సంబంధం లేని, ఒకేలా ఉండే ముగ్గురు వ్యక్తుల జీవితాల్లో ఏం జరిగిందనేది కథ అంటూ అంచనాలు పెంచేశారు యూనిట్. అనిల్ రావిపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. కళ్యాణ్ రామ్ నిర్మించిన ‘పటాస్’ మూవీలో బాబాయ్ బాలయ్య ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ లోని ‘అరే ఓ సాంబ’ సాంగ్ రీమిక్స్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ‘అమిగోస్’ కోసం బాలయ్య ‘ధర్మక్షేత్రం’ లోని ఎవర్ గ్రీన్ సాంగ్ ‘ఎన్నోరాత్రులొస్తాయి గానీ’ రీమిక్స్ సాంగ్ వదలగా ఆకట్టుకుంటోంది.

ట్రైలర్ విషయానికొస్తే.. కళ్యాణ్ రామ్ మూడు విభిన్న పాత్రల్లో, సరికొత్త గెటప్స్‌లో అలరించాడు. బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ విషయంలో ఫోకస్ పెట్టాడు. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. సినిమా మీద అంచనాలు పెంచేసింది ట్రైలర్.. ‘బింబిసార’ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ తో మరో సూపర్ హిట్ అందుకోనున్నాడని.. ఈ చిత్రం జూనియర్ ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ మాదిరి కళ్యాణ్ రామ్ కెరీర్‌కి ప్లస్ అవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఫిబ్రవరి 5న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది. బాబాయ్ బాలయ్య లేదా తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ కానీ అతిథులుగా రావచ్చని అంటున్నారు. మరోవైపు సోదరుడు నందమూరి తారక రత్న ఆసుపత్రిలో ఉండడంతో కార్యక్రమాన్ని పెద్దగా హంగామాలా కాకుండా సింపుల్‌గా చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఫిబ్రవరి 10న భారీ స్థాయిలో విడుదల కానుంది ‘అమిగోస్’..

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus